
సీనియర్ హీరోయిన్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు దక్షిణాదిలోనే స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారీ అందాల తార. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషలలో పలువురు స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారీ ముద్దుగుమ్మ.

కేవలం సినిమాల్లోనే కాదు బుల్లితెరపైనా సత్తా చాటారు రోజా. ప్రముఖ టీవీ కామెడీ షో జబర్దస్త్ షోకు ఎన్నో ఏళ్లుగా న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. అంతేకాదు రాజకీయాల్లోనూ తనదైన మార్క్ చూపించారు రోజా.

అయితే గత ప్రభుత్వంలో ఏపీ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించిన రోజా జబర్దస్త్ తో పాటు అన్ని రకాల టీవీ షోలకు గుడ్ బై చెప్పారు. అయితే ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారామె. ప్రస్తుతం ఆమె ఓ ప్రముఖ ఛానెల్ లో ప్రసారమవుతోన్న డ్రామా జూనియర్స్ సీజన్ 9 షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.

ఇక సోషల్ మీడియాలోనూ రోజా ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. తాజాగా ఆమె ఓ టీవీ షోకు హాఫ్ శారీలో ముస్తాబై వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా రోజా సెల్వమణి రీ ఎంట్రీ ఇచ్చిన తమిళ చిత్రం ‘అన్బే డయానా’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతోంది. రోజా పాత్రకు కూడా మంచి పేరు వచ్చింది. దీంతో ఈ సీనియర్ హీరోయిన్ కు మరిన్ని సినిమా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.