Movie Updates: శౌర్యంగ పర్వం షూటింగ్ అప్పుడే.. విక్రమ్ తనయుడితో అనుపమ..

| Edited By: Prudvi Battula

Mar 13, 2024 | 9:09 AM

‘సలార్’లో వరదరాజ మన్నార్‌గా నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్.. ‘సలార్-2’ అప్‌డేట్ ఇచ్చారు. విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ జంటగా పరశురామ్ తెరకెక్కిస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. ధమాకాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న త్రినాథరావు నక్కిన.. తర్వాతి సినిమాను ప్రకటించారు. కారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్ హీరోగా మారారు. అనుపమ పరమేశ్వరన్ మళ్లీ బిజీ అవుతున్నారు. ఈ మధ్య వరస సినిమాలతో జోరు మీదున్న ఈ బ్యూటీ.

1 / 5
‘సలార్’లో వరదరాజ మన్నార్‌గా నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్.. ‘సలార్-2’ అప్‌డేట్ ఇచ్చారు. ‘సలార్-2’కు స్క్రిప్టు ఇప్పటికే అయిపోయిందని.. ఎప్రిల్‌లోనే షూటింగ్ ఉండొచ్చని తెలిపారు. ‘శౌర్యాంగపర్వం’ వచ్చే ఏఢాదే విడుదలవుతుందని కూడా ప్రకటించారు పృథ్విరాజ్. ‘ఆడు జీవితం’ ట్రైలర్ లాంచ్ సందర్భంగా ‘సలార్-2’ ముచ్చట్లు తెలిపారు ఈ హీరో.

2 / 5
విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ జంటగా పరశురామ్ తెరకెక్కిస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. ఇటీవల ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో విడుదల చేసారు. కళ్యాణి వచ్చా వచ్చా అంటూ సాగే ఈ ఫుల్ సాంగ్ మార్చి 12 సాయంత్రం 6.30 గంటలకు విడుదల అయింది.

3 / 5
ధమాకాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న త్రినాథరావు నక్కిన.. తర్వాతి సినిమాను ప్రకటించారు. సందీప్ కిషన్ మీరోగా హాస్య మూవీస్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రసన్న కుమార్ బెజవాడ స్క్రిప్ట్ అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది.

4 / 5
కారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్ హీరోగా మారారు. ఆయన నటిస్తున్న సినిమాకు మారుతి నగర్ సుబ్రమణ్యం అనే టైటిల్ ఖరారు చేసారు. ఇందులో రావు రమేష్ సరసన ఇంద్రజ నటిస్తున్నారు. లక్ష్మణ్ కార్య ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సందర్భంగా రావు రమేష్ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో చివర్లో ఆ క్యూఆర్ ఇచ్చారు. అది స్కాన్ చేస్తే ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది.

5 / 5
అనుపమ పరమేశ్వరన్ మళ్లీ బిజీ అవుతున్నారు. ఈ మధ్య వరస సినిమాలతో జోరు మీదున్న ఈ బ్యూటీ.. తమిళ ఇండస్ట్రీలోనూ అవకాశాలు అందుకుంటున్నారు. తాజాగా విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా మారి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయ్యారు అనుపమ పరమేశ్వరన్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు బయటికి రానున్నాయి.