Rajitha Chanti |
Jun 03, 2021 | 11:06 PM
కీర్తి సురేష్.. సంప్రదాయానికి ప్రతి బింబంలా ఉంటుంది. భారతీయ చీరకట్టులో కీర్తి ఎన్నో సినిమా వేడుకలను హజరయ్యింది. ఇటీవల ఓ మూవీ ఫంక్షన్ కు కీర్తి ఎర్ర చీరలో హాజరయ్యింది.
సమంత అక్కినేని.. ఫ్యాషన్ ప్రియురాలు.. ఎప్పుడు కొత్తగా ట్రెండ్ అయ్యే ఫ్యాషన్ వైపు ఆసక్తి కనబరుస్తుంది. ఇటీవల పువ్వులను ప్రింట్ చేసిన రెడ్ కలర్ చీరలో తళుక్కుమంది.
కాజల్ అగర్వాల్.. చాలా సందర్బాల్లో చీరలలోనే సినిమా వేడుకలను హాజరయ్యింది. ఇటీవల గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న కాజల్... రెడ్ చీరలో దర్శనమిచ్చింది.
అచ్చమైన భారతీయ సంప్రదాయంలో సాయి పల్లవి ఎంతో అందంగా ముస్తాబవుతుంది. సాయి పల్లవి అనేక సినిమాల్లో కూడా చీరలోనే కనిపిస్తుంది.
మిల్కీ బ్యూటీ తమన్నా.. ఎంతగా ట్రెండీ ఫ్యాషన్ గా కనిపించిన కానీ.. పలు సందర్బాల్లో చీరల్లో తళుక్కుమంటుంది.
ఎర్ర చీరలో టాలీవుడ్ తారలు..