
టాలీవుడ్ సెన్సేషనల్ హిట్ 'సామజవరగమన' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన అందాల నటి రెబా మోనికా జాన్ (Reba Monica John) తన అభిమానులకు ఒక తీపి కబురు అందించారు. త్వరలోనే తాను తల్లి కాబోతున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా తన భర్త జోమాన్ జోసెఫ్‌తో కలిసి దిగిన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రెబా మోనికా జాన్ షేర్ చేసిన ఈ ఫోటో షూట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

బీచ్ లో తన భర్తతో కలిసి ఎంతో సంతోషంగా ఉన్న ఫోటోలను ఆమె పోస్ట్ చేశారు. "త్వరలోనే మా జీవితంలోకి కొత్త అతిథి రాబోతున్నారు" అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ ఇచ్చారు. ఈ వార్త విన్న అభిమానులు, తోటి సినీ సెలబ్రిటీలు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రెబా మోనికా జాన్ మలయాళ చిత్రం 'జాకబింతే స్వర్గరాజ్యం'తో సినీ రంగప్రవేశం చేశారు. తమిళంలో విజయ్ నటించిన 'బిగిల్' సినిమాలో యాసిడ్ బాధితురాలిగా ఆమె చేసిన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

తెలుగులో 'సామజవరగమన' సినిమా ఆమెకు భారీ గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆమె 'మృత్యుంజయ్', 'మ్యాడ్ స్క్వేర్' వంటి పలు క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉన్నారు. రెబా తన లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్ జోమాన్ జోసెఫ్‌ను 2022లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన రెండేళ్ల తర్వాత ఈ జంట ఇప్పుడు తమ మొదటి సంతానం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా రెబా తన గ్లామర్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఆమె ఆరోగ్యంగా ఉండాలని, పండంటి బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఆమె బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్శిటీ నుండి కెమిస్ట్రీలో పట్టా పొందారు. అలాగే శిక్షణ పొందిన క్లాసికల్ డ్యాన్సర్. ఫిబ్రవరి 4, 1994న బెంగళూరులో జన్మించిన ఈ అమ్మడు.. 2016 నుంచి సినీరంగంలో యాక్టివ్ గా ఉంటున్నారు. తెలుగులో శ్రీవిష్ణు నటించిన సామజవరగమన సినిమాతో పాపులర్ అయ్యారు. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. సినిమాల్లోకి రాకముందు ఆమె పలు బ్రాండ్లకు మోడలింగ్ చేశారు.

అటు సినిమాలు తగ్గినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా ఆమె తన భర్తతో కలిసి చేసిన ఫోటోషూట్ నెట్టింట వైరలవుతుంది. మోనిక భర్త విషయానికి వస్తే.. వీరు ఒక పరస్పర స్నేహితుని ద్వారా పరిచయమయ్యారు. సుమారు ఎనిమిదేళ్ల పాటు ప్రేమించుకున్న తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. జోమోన్ జోసెఫ్ వృత్తిరీత్యా ఒక బిజినెస్ కన్సల్టెంట్. ఆయన అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసి, ప్రస్తుతం ఒక మల్టీనేషనల్ కంపెనీ (MNC)లో పనిచేస్తున్నారు.