
నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ దూసుకుపోతోంది. వరుసగా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్‌గా ఫేమస్ అయ్యింది.

దిలా ఉంటే ఐపీఎల్ 2023 ప్రారంభ వేడుకల్లో రష్మిక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన సంగతి తెలిసందే. ఓపెనింగ్ సెర్మనీలో భాగంగా పలు పాటలకు రష్మిక స్టెప్పులు వేసింది.

తాజాగా ఆ ఈవెంట్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది రష్మిక. 'ఈ హ్యాంగోవర్ నుంచి ఇంకా బయటపడలేదు' అంటూ తన పోస్టుకు క్యాప్షన్ ఇచ్చింది.

రష్మిక షేర్ చేసిన ఫొటోల్లో మిస్టర్ కూల్‌తో ఆమె దిగిన ఫొటో కూడా ఉంది. ఇది అటు ధోని అభిమానులు, ఇటు రష్మిక ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.

ఇక సినిమాల విషయానికొస్తే.. రష్మిక మందన్న చేతిలో ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప 2'తో పాటు మరో నాలుగు సినిమాలున్నాయి.