
అందాల చిన్నది రాశి ఖన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే.ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే, అంతలా తన అంద చందాలతో అందరి మనసు దోచేసుకుంటుంది.

ఊహలు గుస గుసలాడే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు, మొదటి సినిమాతో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఈ సినిమా తర్వాత యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

మొదటి సినిమాతోనే తెలుగు అభిమానుల మనసు దోచేసి, తర్వాత చాలా సినిమాల్లో నటించి, జోరు, లౌక్యం, పక్కా కమర్షియల్, జిల్ , బెంగాల్ టైగర్, హైపర్, లవకుశ, వరల్డ్ ఫేమస్ లవర్, తొలిప్రేమ, శివం, సుప్రీమ్ ఇలా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది,

ఇక చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఈ ముద్దుగుమ్మ మాత్రం స్టార్ స్టేటస్ అందుకోలేకపోయింది. ఇక ఈ మధ్య కాలంలో ఈ అమ్మడుకు అవకాశాలు తగ్గడంతో, కీలక పాత్రల్లో నటిస్తూ వస్తుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గ ఉంటూ, ఈ చిన్నది తన అంద చందాలతో అందరి మనసు దోచేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సూట్‌లో తన క్యూట్ లుక్స్ అందరినీ ఆకట్టుకుంది.