Hero Character: మారిన ట్రెండో.. రాక్షసులను మించిన రాక్షసుడిలా హీరో క్యారెక్టర్‌..

| Edited By: Prudvi Battula

Jan 13, 2024 | 9:25 AM

హీరో అంటే సకలగుణాభిరాముడు అయ్యుండాలన్నది పాత మాట. ఇప్పుడు ఆ డెఫినియేషన్ మార్చేస్తున్నారు మేకర్స్‌. విలన్లు మించిపోయే రాక్షసుడే ఇప్పుడు హీరో అన్నది నయా సిల్వర్‌ స్క్రీన్ ఫార్ములాగా మారింది. ముఖ్యంగా మాస్‌ సినిమా బాక్సాఫీస్‌ను రూల్ చేస్తున్న నేపథ్యంలో హీరో అంటే రాక్షసుడే అన్నట్టుగా ఉంది పరిస్థితి. చూశారుగా.... రాక్షసులను వేటాడేందుకు బ్రహ్మరాక్షసుడిలా మారాడు హీరో. 

1 / 5
చూశారుగా.... రాక్షసులను వేటాడేందుకు బ్రహ్మరాక్షసుడిలా మారాడు హీరో. ఒకప్పుడు రాక్షసుల పనిపట్టే దైవ స్వరూపంగా హీరోను చూపించిన మేకర్స్, ఇప్పుడు రాక్షసులనే భయపెట్టే రాక్షసుడిగా హీరో పాత్రను డిజైన్ చేస్తున్నారు. ఈ ఫార్ములా వెండితెర మీద కనకవర్షం కురిపిస్తుండటంతో వరుసగా అలాంటి సినిమాలే రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి.

2 / 5
రీసెంట్‌గా సూపర్ హిట్ అయిన సలార్ విషయంలోనూ ముందు నుంచి హీరో క్యారెక్టర్‌ను మోస్ట్ వైలెంట్ అన్న రేంజ్‌లో చూపిస్తూ వచ్చారు. ఫస్ట్ పోస్టర్‌లోనే 'రాక్షసులే అతణ్ని రాక్షసుడని పిలుస్తారు' అంటూ హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు. ఇక ఆఫ్టర్ రిలీజ్‌, వెండితెర మీద ప్రభాస్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు.

3 / 5
త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న దేవర విషయంలోనూ ఇదే హింట్‌ ఇస్తున్నారు మేకర్స్‌. రీసెంట్ పోస్టర్‌లో 'అతని కన్నా భయకరమైన ఒకే ఒక్క విషయం ఏంటంటే అతని కథ' అన్న కామెంట్‌తో హీరో క్యారెక్టర్‌ను నెక్ట్స్ లెవల్‌లో ఎలివేట్‌ చేసింది దేవర టీమ్‌.

4 / 5
నార్త్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పుష్పరాజ్‌ ఫార్ములా కూడా ఇదే. తను అనుకున్నది సాధించడానికి ఎంతమందినైన అంతం చేసే రాక్షసుడిలా పుష్పరాజ్‌ను తెర మీద చూపించారు దర్శకుడు సుకుమార్‌. ఆ సినిమా సూపర్ హిట్ కావటంతో సీక్వెల్‌ వైలెన్స్‌ డోస్ మరింత పెంచి చూపించబోతున్నారు.

5 / 5
రీసెంట్ సెన్సేషన్‌ యానిమల్‌లోనూ హీరో క్యారెక్టర్ ఆడియన్స్‌కు షాక్ ఇచ్చింది. వీడు హీరోనా, విలనా అన్న క్లారిటీకి ప్రేక్షకుడు వచ్చేలోపే సినిమా కథ ముగిసింది. అంతలా వెండితెర మీద రక్తపుటేరులు పారించారు రణబీర్‌ కపూర్‌. ఇక యానిమల్ పార్క్ అంతకు మించి ఉంటుందని ఆల్రెడీ హైప్‌ పెంచేస్తున్నారు మేకర్స్‌.