
మహారాజ (Maharaja): విజయ్ సేతుపతి నటించిన 50వ చిత్రం 'మహారాజ' ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టించింది. ఒక సాధారణ సెలూన్ యజమాని తన పోగొట్టుకున్న 'లక్ష్మి' (ఒక ఇనుప డబ్బా) కోసం పోలీసులకు ఫిర్యాదు చేయడం అనే విభిన్నమైన కథాంశంతో ఇది మొదలవుతుంది. అయితే, దీని వెనుక ఉన్న అసలు రహస్యం , క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తుంది.

పోర్ తోళిల్ (Por Thozhil): ఇన్వెస్టిగేటివ్ త్రిల్లర్ల జాబితాలో ఇది ఒక మాస్టర్ పీస్. ఒక సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి సీనియర్ , జూనియర్ పోలీస్ ఆఫీసర్లు చేసే వేట ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంది. సోనీ లివ్‌లో అందుబాటులో ఉన్న ఈ సినిమా ప్రతి నిమిషం ఎంతో గ్రిప్పింగ్‌గా సాగుతుంది.ఈ సినిమా ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తుంది.

ఇరట్ట (Iratta): మలయాళంలో రూపొందిన ఇరట్ట చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. కవల సోదరులైన ఇద్దరు పోలీసుల మధ్య ఉండే వైరం, పోలీస్ స్టేషన్లో జరిగే ఒక అనుమానాస్పద మృతి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమా చివర్లో వచ్చే ట్విస్ట్ ఎవ్వరూ ఊహించలేరు. ఈ చిత్రం సస్పెన్స్, ట్విస్టులు చూస్తూ ఉండిపోతారు.

చిత్త (Chithha): సిద్ధార్థ్ నటించిన ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. ఇది కేవలం క్రైమ్ త్రిల్లర్ మాత్రమే కాదు, భావోద్వేగాలతో కూడిన కథ. చిన్నపిల్లలపై జరిగే అఘాయిత్యాల నేపథ్యంలో సాగే ఈ ఇన్వెస్టిగేషన్ డ్రామా ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.

అన్వేషిప్పిన్ కండేతుమ్ (Anweshippin Kandethum): టోవినో థామస్ హీరోగా నటించిన ఈ పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్ పాత కాలపు పోలీస్ ఇన్వెస్టిగేషన్ పద్ధతులను అద్భుతంగా చూపిస్తుంది. రెండు వేర్వేరు హత్య కేసుల విచారణ నేపథ్యంలో సాగే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించవచ్చు. ఈ సినిమాలోని ట్విస్టులు, విజువల్స్ మీకు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తాయి.