Tollywood: అల్లరి మొగుడు మూవీ చేస్తున్నప్పుడు మోహన్ బాబు బెదిరించేవారు.! కానీ ఆ తర్వాత..

Updated on: Apr 02, 2026 | 12:14 PM

మోహన్ బాబుతో అల్లరి మొగుడు చిత్రీకరణ సమయంలో ఆయన బెదిరింపు ధోరణి చూసి భయపడ్డానని నటి మీనా వెల్లడించారు. తాను అమాయకురాలిని, చిన్నపిల్లనని, తర్వాత ఆయన మంచి మనసును అర్థం చేసుకున్నానని ఆమె తెలిపారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జునలతో తన అనుభవాలు, వ్యక్తిగత జీవితంపై కూడా మీనా కీలక వ్యాఖ్యలు చేశారు.

1 / 5
అల్లరి మొగుడు చిత్రం షూటింగ్‌లో జరిగిన సంఘటనలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హీరోయిన్ మీనా. తాను అప్పట్లో చాలా చిన్నపిల్లనని, అమాయకురాలినని, తెలుగు భాష కూడా సరిగా తెలియదని మీనా వెల్లడించారు. మోహన్ బాబు బెదిరింపు ధోరణి, ఆయన హడావిడి చేసే విధానం, అందరినీ రేయ్, రారా, పోరా అని పిలవడం వంటివి చూసి మొదట భయపడ్డానని ఆమె తెలిపారు. తమిళ లేదా తెలుగులో అలాంటి వ్యక్తిని తాను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. మోహన్ బాబు తన కాలు లాగేవాడని, అది జోక్ అని కూడా అప్పుడు తనకు అర్థం కాలేదని మీనా అన్నారు. తర్వాత ఆయనలోని మంచి మనసును గుర్తించి ఆయన కుటుంబంతో ఫ్రెండ్‌గా మారిపోయానని అన్నారు.

2 / 5
చిరంజీవి, నాగార్జునలతో భారీ హిట్లు కొట్టిన మీనాకు, వెంకటేష్‌తో ఉన్న ట్రాక్ రికార్డ్ ప్రత్యేకం. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి.

3 / 5
 స్టార్ హీరోయిన్‌గా కెరీర్‌లో నిలదొక్కుకున్న సమయంలో తనకు ఎవరూ లవ్ ప్రపోజల్స్ ఇవ్వలేదని మీనా షాకింగ్ నిజం చెప్పారు. తాను చూడటానికి చాలా చిన్నపిల్లలా, అమాయకురాలిగా ఉండటమే అందుకు కారణమని ఆమె నవ్వుతూ వెల్లడించారు.

4 / 5
తల్లితో గడపడం, పుస్తకాలు చదవడం తప్ప తనకు బయటి ప్రపంచం తెలియదని మీనా అన్నారు. తాను ఒక ఇంట్రోవర్ట్ అని, షూటింగ్ ముగియగానే ఇంటికి వెళ్లడం తప్ప పార్టీలు, చాటింగ్ వంటివి తనకు అలవాటు లేదని చెప్పారు.

5 / 5
 షూటింగ్‌కు కరెక్ట్ టైమ్‌కు రావడం మీనా అలవాటు. ఆమె ప్రొఫెషనలిజం చూసి మోహన్ బాబు వంటి సీనియర్లు కూడా "ఈ అమ్మాయికి కరెక్ట్ టైం చెప్పండి రా" అని సిబ్బందిని హెచ్చరించేవారట. ఆ క్రమశిక్షణే ఆమెను స్టార్‌ను చేసింది.

Follow Us