Cinema OTT: అమ్మాయిల శవాల నుంచి పెర్ఫ్యూమ్.. రెండు ఓటీటీల్లో దుమ్మురేపుతున్న సినిమా..

Updated on: Nov 23, 2026 | 9:14 PM

ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేసి, శవాల నుంచి పర్ఫ్యూమ్ తయారు చేసే సైకో కిల్లర్ కథతో తెరకెక్కిన తెలుగు థ్రిల్లర్ ఇప్పుడు జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఐదు భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ సస్పెన్స్ మిస్టరీ చిత్రం కథాంశం, నటీనటుల విశేషాలు ఇక్కడ చదవండి.

1 / 5
సైకలాజికల్ సస్పెన్స్, మిస్టరీ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకులకు ఆసక్తికరమైన చిత్రం అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో సందడి చేసిన తెలుగు సైకో కిల్లర్ థ్రిల్లర్ 'మయూఖ' ఇప్పుడు డిజిటల్ వేదికపై స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సినిమా, తాజాగా జియోహాట్‌స్టార్ ఓటీటీలోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

2 / 5
దర్శకుడు శ్రీతేజ్ తెరకెక్కించిన 'మయూఖ' చిత్రం నవంబర్ 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాగా, నవంబర్ 22 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. జియోహాట్‌స్టార్‌లో ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రావడం విశేషం.

3 / 5
కథ విషయానికి వస్తే.. ఒంటరిగా ఉంటున్న మహిళలను టార్గెట్ చేస్తూ హత్యలు చేసే ఒక సైకో కిల్లర్, వారి శవాలను కాల్చి పర్ఫ్యూమ్ తయారు చేస్తాడనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ కథ సాగుతుంది. బ్యాంక్ ఉద్యోగిని అయిన మయూఖ ఓ ఫ్లాట్‌లో ఒంటరిగా నివసిస్తుంటుంది. చిన్నతనంలో జరిగిన ఒక చేదు, భయానక సంఘటన కారణంగా ఆమె ఎప్పుడూ ఏదో ఒక భయంతోనే జీవిస్తుంటుంది.

4 / 5
తన అపార్ట్‌మెంట్‌లో ఎవరో ఉన్నారని, రాత్రి వేళల్లో తన పక్కన పడుకుంటున్నారని భయపడి పోలీసులకు ఫిర్యాదు కూడా చేస్తుంది. సరిగ్గా అదే సమయంలో మయూఖ ఫ్లాట్‌లో ఒక హత్య జరుగుతుంది. మరోవైపు ఒంటరి అమ్మాయిలను వరుసగా చంపుతున్న సైకో కిల్లర్ ఎవరు? మయూఖ పరిస్థితి ఏమైంది? ఈ కథలో బిగ్ బాస్ అమన్ పాత్ర ఏంటి? అనే ఉత్కంఠభరిత అంశాలతో సినిమాను రూపొందించారు.

5 / 5
ఈ చిత్రంలో పాయల్ చెంగప్ప, అభిలాష్ అడ్డ, చరిష్మా, మురళీధర్ గౌడ్, బిగ్ బాస్ అమన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. నెమ్మదిగా మొదలై ప్రీ క్లైమాక్స్ నుంచి కథ వేరే స్థాయికి వెళుతుందని, కొన్ని అంశాలు మలయాళ థ్రిల్లర్ చిత్రాలను తలపిస్తాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్‌లలో 'మయూఖ' మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us