
పవన్ కల్యాణ్ సినీ కెరీర్‌లో ఐదు ఫ్లాప్‌ల తర్వాత వచ్చిన "జల్సా" సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా తన స్నేహాన్ని చాటుకున్నారు మహేష్ బాబు.

ఫ్యాన్స్ కొట్టుకుంటున్నా, హీరోల మధ్య మాత్రం మంచి బాండింగ్ ఉంటుందని మహేష్ బాబు ఒక ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చెప్పిన మాటలు అక్షర సత్యాలు. మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్‌లో పవన్ కళ్యాణ్ పేరు కచ్చితంగా ఉంటుంది. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహానికి నిదర్శనమే 2008లో విడుదలైన జల్సా.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అలియాస్ సంజయ్ సాహు ఎంట్రీ ఇవ్వకముందే, మహేష్ బాబు గొంతు వినిపిస్తుంది. ఈ సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం అప్పట్లో ఒక పెద్ద సంచలనం. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ వరుసగా ఐదు ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్నారు. కచ్చితంగా హిట్ కొట్టాల్సిన సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ కథను సిద్ధం చేశారు.

అతడు వంటి కల్ట్ క్లాసిక్ తర్వాత త్రివిక్రమ్ మీద ఉన్న నమ్మకంతో పాటు, పవన్ కళ్యాణ్‌తో ఉన్న స్నేహం కారణంగా వాయిస్ ఓవర్ ఇవ్వమని అడగ్గానే మహేష్ బాబు ఒప్పుకున్నారు. కేవలం ఒప్పుకోవడమే కాదు, ఆ పని చేసినందుకు ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా తన ఉదారతను చాటుకున్నారు.

మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం. జల్సా పవన్ కళ్యాణ్‌ను మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కించిన సినిమాగా నిలిచిపోయింది. హీరోల మధ్య ఉండే ఇలాంటి స్నేహపూర్వక బంధం ఫ్యాన్స్‌కి ఒక సందేశం లాంటిది, ఇప్పుడున్న కుర్ర హీరోలకు కూడా ఆదర్శం.