Movie News: భారీ వ్యూస్ తో దూసుకుపోతున్న గుంటూరు కారం సాంగ్.. ఉత్తరాదిన హనుమాన్ హవా..

Edited By: Prudvi Battula

Updated on: Jan 20, 2024 | 3:53 PM

మహేష్ బాబు గుంటూరు కారం ఇండియాలోనే కాదు.. యూఎస్ మార్కెట్‌లోనూ దూసుకుపోతుంది. జనవరి 19న వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఉదయం 11 గం. లకు భారీ కటౌట్ ఏర్పాటు చేసారు. సీనియర్ ఎన్టీఆర్ 28వ వర్థంతి సందర్భంగా ఆయన నటించిన మొదటి సినిమా మన దేశం 75 సంవత్సరాల విజయోత్సవ వేడుకలు హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగాయి. హన్సిక కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘105 మినిట్స్‌’.  హనుమాన్ సినిమా సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి. హిందీలోనూ ఈ సినిమాకు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వస్తుంది. 

1 / 5
మహేష్ బాబు గుంటూరు కారం ఇండియాలోనే కాదు.. యూఎస్ మార్కెట్‌లోనూ దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ చిత్రం 2.4 మిలియన్ డాలర్స్ అందుకోగా.. 2.5 మిలియన్ మైల్ స్టోన్ వైపు అడుగులు వేస్తుంది. మరోవైపు ఈ చిత్రంలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ యూ ట్యూబ్‌లో 50 మిలియన్ వ్యూస్ అందుకుంది. ఇందులో మహేష్ డాన్సులు బాగా పేలాయి.

2 / 5
జనవరి 19న వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఉదయం 11 గం. లకు సూర్యాపేటలోని రాజుగారి తోట ప్రాంతంలో 126 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేసారు అభిమానులు. ఈ న్యూస్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది. తెలుగు, హిందీలో ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ఫిబ్రవరి 9న ఘనంగా విడుదల కానుంది.

3 / 5
సీనియర్ ఎన్టీఆర్ 28వ వర్థంతి సందర్భంగా ఆయన నటించిన మొదటి సినిమా మన దేశం 75 సంవత్సరాల విజయోత్సవ వేడుకలు హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగాయి. ఎన్టీఆర్ సెంటనరీ సెలబ్రేషన్స్ కమిటీ ఆధ్వర్యంలో ' మనదేశం' చిత్ర నిర్మాత శ్రీమతి కృష్ణవేణి, ఆ చిత్ర దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ కుమారుడు రమేష్ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వాళ్లందర్నీ సత్కరించారు.

4 / 5
హన్సిక కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘105 మినిట్స్‌’. రాజు దుస్స దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కేవలం ఒక్క పాత్ర మాత్రమే ఉంటుంది. ఆమె చుట్టూనే కథ అంతా తిరుగుతుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం భయంతో వణుకు పుట్టించేలా ఉంది.

5 / 5
హనుమాన్ సినిమా సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి. హిందీలోనూ ఈ సినిమాకు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వస్తుంది. ఇప్పటి వరకు అక్కడ 22 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. ఈ క్రమంలోనే కెజిఎఫ్ చాప్టర్ 1, కాంతారా మొదటి వారం హిందీ కలెక్షన్ల రికార్డులను దాటేసాడు హనుమాన్. అయోధ్య రామ్ మందిర్ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఉత్తరాదిన హనుమాన్ హవా మరింతగా కనిపించే అవకాశం ఉంది.