
అందాల ముద్దుగుమ్మ లాస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ తన అందంతో, మాటకారితనంతో ఎంతో మంది మదిని దోచుకుంది. మంచి ఫ్యాన్ బెస్ సొంతం చేసుకుంది. కాగా, ఈ బ్యూటీ గురించి పలు విషయాలు తెలుసుకుందాం.

సమ్ థింగ్ స్పెషల్ అంటూ తెలుగు అభిమానులకు పరిచయమైన బ్యూటీ లాస్య. ఈ అమ్మడు యాంకర్‌గా తన కెరీర్ మొదలు పెట్టి, చీమ, ఏనుగు అంటూ చిట్టి పొట్టి కథలు చెబుతూ మంచి ఫేమ్ సంపాదించింది.

యాంకర్‌గా మంచి ఫేమ్ సంపాదించుకున్న తర్వాత ఈ అమ్మడు, బిగ్ బాస్ సీజన్ 4కి అడుగు పెట్టి అక్కడ కూడా తన ఆట తీరుతో అందరి మనసు దోచుకుంది. ఈ బ్యూటీ చాలా రోజులు హౌస్‌లో ఉంటుంది అనుకున్నారు కానీ,మధ్యలోనే ఎలిమినెట్ అయ్యింది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో అందరి మనసు దోచుకునే ఈ చిన్నది తాజాగా సిల్క్ చీరలో తన అందంతో అందరి మనసు దోచేసింది.

పచ్చని చెట్ల మధ్య తన చిరు నవ్వుతో.. సిగ్గు పడుతూ పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. అందులో ఈ బ్యూటీ చాలా అందంగా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.