Cinema OTT : జెన్ జీ కుర్రాళ్లకు తెగ నచ్చేసిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి.. అస్సలు మిస్ అవ్వకండి..

Updated on: Aug 20, 2026 | 10:36 PM

ప్రస్తుతం జెన్ జీ యూత్ గురించి సోషల్ మీడియా ప్రపంచంలో తెగ వైరలవుతున్నాయి. అలాగే ఈతరం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మేకర్స్ సైతం సరికొత్త సినిమాలను తీసుకువస్తున్నారు. ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు అదే సినిమా ఓటీటీలోకి రాబోతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసుకుందామా.

1 / 5
Chతెలుగు చిత్రసీమలో యువ కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం, 'లవర్' చిత్రంతో ఆకట్టుకున్న శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా "చెన్నై లవ్ స్టోరీ". థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా అలరించిన ఈ కల్ట్ క్లాసిక్ చిత్రం ఇప్పుడు డిజిటల్ వేదికపైకి రాబోతోంది. రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి 'బేబీ' చిత్ర దర్శకుడు సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం.

2 / 5
 ఎస్‌కేఎన్ , సాయి రాజేష్ సంయుక్తంగా మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. స్వర బ్రహ్మ మణిశర్మ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పాటలతో పాటు సన్నివేశాల తీవ్రతను మణిశర్మ తన సంగీతంతో మరింతగా పెంచారు. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ పొందింది.

3 / 5
కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ఘన విజయాన్ని నమోదు చేసింది. సినిమాలో కిరణ్ అబ్బవరం 'స్టీవెన్ శంకర్' అనే ఆశయాలున్న దర్శకుడి పాత్రలో ఎంతో సహజంగా నటించగా, శ్రీ గౌరి ప్రియ 'నివేదిత' అనే డిప్రెషన్ నుంచి బయటపడే క్లిష్టమైన పాత్రలో జీవించింది. వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ, భావోద్వేగాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

4 / 5
థియేటర్లలో గ్రాండ్ సక్సెస్ సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ చిత్ర డిజిటల్ ప్రసార హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఆగస్టు 21 నుండి ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ సోనీలివ్‌లో ప్రసారం కానుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రాబోతుండటంతో వివిధ భాషల డిజిటల్ ప్రేక్షకులు దీనికోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

5 / 5
థియేటర్లలో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీ వేదికగా కూడా అంతే గొప్ప విజయాన్ని సాధిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ. 15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ఘన విజయాన్ని అందుకుంది.  జూలై 24న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల విశేష ఆదరణ పొందింది.

Loading...
Unable to load recommendations.
Follow Us