
ముఖ్యంగా ఈ అమ్మడు మహానటి సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుందనే చెప్పాలి. ఈ మూవీలో కీర్తి నటనకు అందరూ ఫిదా అయిపోయారు.

ఇక కీర్తి సురేష్ ఇటీవలే తన చిన్న నాటి స్నేహితుడు ఆంటోని థట్టిల్‌ను తన కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

వివాహం తర్వాత కీర్తి పసుపు తాడుతో పలు సార్లు మీడియా కంట చిక్కింది. దీంతో అందరూ ఈ నటి తెగ పొగిడేశారు. మెడలో తాళితో కీర్తి చాలా అందంగా ఉంది. తాను వివాహానికి మంచి గౌరవం ఇస్తుందన్నారు.

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన బాలీవుడ్ మూవీ అక్క టీజర్ విడుదల చేయగా అందులో ఈ అమ్మడు తాళి లేకుండా కనిపించారు.

కీర్తి మెడలో బంగారు ఆభరణాలు ధరించింది కానీ, తాళి మాత్రం లేదు. దీంతో ఈ బ్యూటీ అభిమానులు షాక్ అయ్యారు. పెళ్లై సంవత్సరం కాకముందే తాళి ధరించడం మానేశావా అంటూ పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.