Indraja: ఆ హీరో చాలా గొప్పవ్యక్తి.. ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం

Updated on: May 20, 2026 | 2:37 PM

తెలుగులో వరుస సినిమాలతో అలరించింది హీరోయిన్ ఇంద్రజ. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకున్న ఆమె.. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఇప్పుడు బుల్లితెరపై పలు షోలలో పాల్గొంటూ మరోసారి సినీప్రేక్షకులను అలరిస్తుంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో జడ్జీగా వ్యవహరిస్తుంది.

1 / 5
ఒకప్పటి అందాల తార ఇంద్రజ ఓ ప్రత్యేక పోడ్‌కాస్ట్‌లో అనేక అంశాలను చర్చించారు. కోపం వెనుక స్వచ్ఛమైన మనసు ఉంటుందని, ఎటువంటి కల్మిషం లేకుండా, నైతిక విలువలను పాటించేవారిలో కోపం సహజమని ఆమె అన్నారు. తనను సరిగా గౌరవించని సందర్భాలలో కోపం వస్తుందని, అటువంటి వ్యక్తిగత విలువలకు ప్రాధాన్యత ఇచ్చేవారికి ఇది తప్పదని ఆమె అభిప్రాయపడ్డారు.

2 / 5
నటసింహం బాలకృష్ణ వ్యక్తిత్వంపై మాట్లాడుతూ, ఆయన "చిన్నపిల్ల మనస్తత్వం" కలిగిన గొప్ప వ్యక్తి అని ఇంద్రజ ప్రశంసించారు. ఆయన తండ్రి గురించి వివరించే విధానం చాలా అందంగా ఉంటుందని తెలిపారు. తాను సినీ పరిశ్రమకు కొత్తగా వచ్చినప్పుడు, బాలకృష్ణ సెట్‌లోకి రాగానే లేచి నిలబడి "రా రా ఇంద్రజ" అని ఆప్యాయంగా పలకరించి కూర్చోబెట్టిన తీరును గుర్తు చేసుకున్నారు.

3 / 5
అటువంటి సంస్కారం, గౌరవం ఈ రోజుల్లో చాలా అరుదని ఆమె అన్నారు. "మీరు చేసిన పనులు మర్చిపోవచ్చు, చేసిన సహాయం మర్చిపోవచ్చు, కానీ మీరు వాళ్ళని ఎలా ట్రీట్ చేశారో అది ఎప్పటికీ మర్చిపోరు" అని ఇంద్రజ తెలిపారు. "సొగసు చూడ తరమా" సినిమా గురించి మాట్లాడుతూ, అప్పట్లో విభిన్నమైన పైజమా లాల్చీ కాస్ట్యూమ్‌ను ప్రస్తావించారు. ఆ "న్యూ ఎరా, న్యూ ఫ్యాషన్" క్రెడిట్ మొత్తం దర్శకుడు గుణశేఖర్‌కే చెందుతుందని ఇంద్రజ స్పష్టం చేశారు.

4 / 5
గుణశేఖర్ గారు ప్రతి చిన్న డీటెయిల్‌కు ప్రాధాన్యత ఇస్తారని, కాస్ట్యూమ్స్ నుంచి సెట్ డిజైన్ వరకు, ప్రతి సీన్ ఎలా ఉండాలో ఒక స్కెచ్‌లాగా మైండ్‌లో పెట్టుకుంటారని కొనియాడారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం హైదరాబాద్‌లోనే జరిగిందని ఆమె తెలిపారు. నరేశ్ గారితో తన రీ-ఎంట్రీ సినిమా "శతమానం భవతి"లో పనిచేసిన విషయాన్ని ఇంద్రజ గుర్తు చేసుకున్నారు. అయితే, సినీ పరిశ్రమలో మహిళా నటులు ఎదుర్కొంటున్న కెరీర్ సవాళ్లపై ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు. పెళ్లి లేదా పిల్లలు పుట్టిన తర్వాత మహిళలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా పరిమితం కావడం, అదే వయస్సు గల పురుష నటులు హీరోలుగా కొనసాగడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.

5 / 5
దీనిని "తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం" లేదా "మేల్ డామినేషన్"గా ఆమె అభివర్ణించారు. "అల్టిమేట్‌గా సఫర్ అయ్యేది మహిళలే" అని, వ్యక్తిగతంగా, వృత్తిపరంగా చాలా తక్కువ సమయంలోనే వారిని పక్కన పడేస్తారని ఆమె అన్నారు. ఈ పరిస్థితికి ఆడియన్స్ మైండ్‌సెట్ ఒక కారణం కావచ్చునని ఇంద్రజ అన్నారు . అయితే, పెళ్లి తర్వాత మహిళల ప్రాధాన్యతలు మారతాయని, ముఖ్యంగా మాతృత్వం వారి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు అని వివరించారు.దాని వల్లే కెరీర్‌పై అంతగా దృష్టి పెట్టలేరని అన్నారు.  

Follow Us