
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క సినిమా రూ.100 కోట్లు కొట్టడం అంటే పెద్ద టాస్క్ అది. దాని కోసం సినిమా స్టార్టింగ్ నుంచి ప్రమోషన్స్ చేస్తే తప్ప ఈ రికార్డ్ అంత ఈజీగా అందుకోలేరు.

అయితే ఓ హీరో మాత్రం తన సినీ కెరియర్లో చాలా ఈజీగా ఈ రికార్డ్ ను సాధించాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 సార్లు రూ.100 కోట్లు అందుకున్నాడు. ఇప్పటిలో ఈ రికార్డ్ ను ఎవరూ బ్రేక్ చెయ్యలేరు. ఆ హీరో ఎవరో ఇక్కడ చూద్దాం..

ఆ స్టార్ ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. సినిమా రిలీజ్ అయితే చాలు హిట్స్ , ఫ్లాప్స్ అని చూడకుండా రూ. 100 కోట్లు అందుకోవడమే టార్గెట్ లాగా అయిపొయింది.

ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన 'సికందర్' సినిమా కూడా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. మన ఇండియాలో ఇలాంటి మైలురాయిని అందుకున్న ఏకైక హీరో సల్మాన్ ఖాన్ మాత్రమే

ఈ రికార్డ్ పై రియాక్ట్ అయిన సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ భవిష్యత్తులో ఏ హీరో కూడా ఈ రికార్డ్ బ్రేక్ చేయడం కష్టం అని కామెంట్స్ చేస్తున్నారు. లెక్కలు తారు మారు అయ్యి ఇంకో హీరో పక్కాగా ఈ రికార్డ్ బద్దలు కొడతాడని అంటున్నారు. మరి, ఏం జరుగుతుందో చూడాలి.