
అందం అభినయం ఉన్న అవకాశాలు అందుకోలేకపోతుంది క్రేజీ బ్యూటీ హెబ్బా పటేల్. తన తరం భామలందరూ సినిమాలతో బిజీగా ఉంటే ఈ చిన్నది మాత్రం రేసులో వెనకబడింది. అలా ఎలా సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టింది హెబ్బా.

తొలి సినిమా బెడిసికొట్టిన ఆఫర్స్ మాత్రం ఒడిసిపట్టుకుంది. అదే సమయంలో కుమారి 21 సినిమా ఈ బ్యూటీకి చాలా ప్లస్ అయ్యింది. కుమారి 21 ఎఫ్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో బోల్డ్ లుక్స్ లో అదరగొట్టింది.

ఈ సినిమా తర్వాత హెబ్బాకు ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ సక్సెస్ లు మాత్రం రాలేదు. హీరోయిన్ గా అంతగా సక్సెస్ అవ్వలేకపోయింది ఈ చిన్నది. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా కూడా చేసింది. అయినా ఫలితం లేకుండా పోయింది.

అదేవిధంగా స్పెషల్ సాంగ్స్ లోనూ ఊపేసింది. అయినా లాభం లేకుండా పోయింది. కాగా ఇప్పుడు సోషల్ మీడియాతో రచ్చ చేస్తుంది. అడపాదడపా సినిమాలు చేస్తున్నా అవి అంతగా హిట్ అవ్వడం లేదు. దాంతో ఈ బ్యూటీ స్పీడ్ తగ్గిపోయింది.

కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ దర్శకనిర్మాతలు ఆకర్షిస్తుంది. ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు నెట్టింట యమా క్రేజ్ ఉంది. ఈ భామ ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా కొన్ని ఫోటోలు వాడింది ఈ భామ.