
యూట్యూబర్‌గా, రేడియో జాకీగా, వీడియో జాకీగా, సింగర్‌గా, యాంకర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా.. ఇలా విభిన్న రంగాల్లో సత్తా చాటుతూ మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాలిటీగా గుర్తింపు తెచ్చుకుంది ఆర్జే కాజల్. ఇక బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోనూ పార్టిసిపేట్ చేసిందీ అందాల తార

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది ఆర్జే కాజల్. టైటిల్ విజేతగా నిలవకున్నా తన అందం, ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక పలు టీవీషోస్, ప్రోగ్రామ్స్ లో సందడి చేస్తోది ఆర్జే కాజల్.

సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది ఆర్జే కాజల్. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలను అందులో షేర్ చేసుకుంటుంది. అలాగే తన ఫ్యామిలీ ఫొటోస్ ను కూడా పోస్ట్ చేస్తుంటుంది.

కాగా రంజాన్ వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది కాజల్. తన కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన క్షణాలను అందులో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

ఆర్జే కాజల్ షేర్ చేసిన ఫొటోలను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఇందులో ఆమె కూతురు కూడా ఉంది. దీంతో ఆర్జే కాజల్ కి ఇంత పెద్ద కూతురు ఉందా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఇదిలా ఉంటే విజయ వాడకు చెందిన ఆర్జే కాజల్ అసలు పేరు రహిమునిస్సా మెహ్ సబీనా. విజయ్ శీలంశెట్టిని ప్రేమ వివాహం చేసుకున్న ఆమెకు ఓ కుమార్తె ఉంది. ప్రస్తుతం ఈ స్టార్ కిడ్ ఉన్నత చదువులు అభ్యసిస్తోందని తెలుస్తోంది.