Pawan VS Ajith: ఇక్కడ పవన్‌.. అక్కడ అజిత్‌.. దారులు వేరైనా.. గమ్యం మాత్రం ఒకటే..

|

Jan 26, 2025 | 7:03 PM

మామూలుగా సినిమాల విషయంలో ఇక్కడ పవన్‌ కల్యాణ్‌.. తమిళనాడులో విజయ్‌ని పోలుస్తుంటారు. కానీ చరిష్మా పరంగా ఎప్పుడూ పవన్‌ కల్యాణ్‌కీ, అజిత్‌కీ మధ్య కంపేరిజన్‌ కనిపిస్తుంటుంది. అయితే ఈ ఏడాది సినిమాల విషయంలో వీరిద్దరినీ పోలుస్తూ చర్చలు షురూ చేస్తున్నారు ఫ్యాన్స్.

1 / 5

2 / 5
హరిహరవీరమల్లు సాంగ్‌ విని పండగ చేసుకుంటున్నారు అభిమానులు. అదీ.. మా పవర్‌స్టార్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటున్నారు. పక్కా జానపదం ఆయన గొంతులో పడితే వేరే లెవల్లో వినిపిస్తుందంటూ లిరిక్స్‎ని వైరల్‌ చేస్తున్నారు. హరిహరవీరమల్లు టీమ్‌ ఇదే జోరు కంటిన్యూ చేస్తే చెప్పిన టైమ్‌కి థియేటర్లలో వాలడం పక్కా అన్నది అందరి నమ్మకం.

3 / 5
ఇటు హరిహరవీరమల్లు ఆన్‌ టైమ్‌కి వచ్చేస్తే, ఓజీ సినిమా కూడా ఇయర్‌ ఎండింగ్‌లోపు ప్రేక్షకులను పలకరించడం ఖాయం అన్నది ట్రేడ్‌ పండిట్స్ లో వినిపిస్తున్న మాట. అదే జరిగితే ఈ ఏడాది ఒకటికి రెండు సినిమాలతో ఆడియన్స్‎కి హలో చెప్పేస్తారు పవన్‌ కల్యాణ్‌.

4 / 5
లాస్ట్ ఇయర్‌ సిల్వర్‌ స్క్రీన్‌ని మిస్‌ చేసుకున్న స్టార్లలో మన దగ్గర పవన్‌ ఉంటే, తమిళనాడులో అజిత్‌ కూడా ఉన్నారు. ఇక్కడ పవన్‌ రాజకీయాల్లో గెలిస్తే, అక్కడ అజిత్‌ తనకు నచ్చిన రేసింగ్‌లో దూసుకుపోయారు. కానీ ఈ ఏడాది ఆయన పట్టుదలతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అంటున్నారు.

5 / 5
పట్టుదల సినిమా మాత్రమే కాదు, గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ కూడా ఈ ఏడాదే విడుదల చేయాలన్నది అజిత్‌ ప్లాన్‌. ముందనుకున్న ప్రకారమైతే, ఈ సంక్రాంతికే రిలీజ్‌ కావాల్సింది గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ. ఆఖరి నిమిషంలో వాయిదా వేశారు మేకర్స్. నెక్స్ట్ బిగ్గెస్ట్ సీజన్‌ చూసుకుని గుడ్‌ బ్యాడ్‌ అగ్లీని రిలీజ్‌ చేయాలన్న ప్లానింగ్‌ మాత్రం గట్టిగానే జరుగుతోంది.