
సినిమా ఇండస్ట్రీలో వారసత్వంగా వచ్చే అవకాశాలు కొత్తేమీ కాదు. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు, హీరోయిన్ల కుటుంబాలకు చెందిన నటీనటులు వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొందరు వరుస విజయాలతో స్టార్‌డమ్ అందుకుంటే.. మరికొందరు కొద్దికాలానికే ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలాంటి వారిలో ఒకరే నిషా అగర్వాల్. నిషా అగర్వాల్ పేరు చెప్పగానే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.

కాజల్‌కు చెల్లెలైన నిషా కూడా హీరోయిన్‌గా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. గ్లామర్‌తో పాటు నటనతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. తక్కువ సినిమాల్లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నిషా అగర్వాల్ 2010లో విడుదలైన ‘ఏమైంది ఈ వేళ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నిషా హీరోయిన్‌గా కనిపించింది. తొలి సినిమాతోనే ఆమె నటనకు మంచి స్పందన రావడంతో పాటు, యూత్‌లోనూ గుర్తింపు సంపాదించింది.

ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు సినిమాలు చేసింది. ‘సోలో’, ‘ఇష్టం’ వంటి చిత్రాలతో ఇతర భాషల ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. నిషా అగర్వాల్ కెరీర్‌లో ‘సుకుమారుడు’, ‘డీకే బోస్’ తదితర సినిమాలు ఉన్నాయి. వరుసగా పెద్ద సినిమాలు చేయకపోయినా.. తన అందం, నటనతో ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకుంది. అయితే కెరీర్‌లో మరింత ముందుకు వెళ్లే సమయంలోనే ఆమె వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టింది.

సినిమాల్లో కొనసాగుతున్న సమయంలోనే నిషా అగర్వాల్ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కుటుంబ జీవితానికి ప్రాధాన్యత ఇచ్చిన ఆమె.. క్రమంగా సినిమాలకు దూరమైంది. అనంతరం తల్లిగా కొత్త బాధ్యతలు స్వీకరించడంతో నటనకు పూర్తిగా బ్రేక్ ఇచ్చింది. దీంతో ఆమెను వెండితెరపై మళ్లీ చూడాలని కోరుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. అయితే సినిమాలకు దూరమైనప్పటికీ నిషా అగర్వాల్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటోంది.

నిషా తరచూ తన కుటుంబానికి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత ఫొటోలు, ఫ్యామిలీ మూమెంట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఆమె ఫొటోలు, వీడియోలకు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుంటుంది. సినిమాల్లో కనిపించకపోయినా.. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటూ తన క్రేజ్‌ను కొనసాగిస్తోంది. ప్రస్తుతం అక్క కాజల్ అగర్వాల్ మాత్రం వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతోంది. మరోవైపు నిషా అగర్వాల్ మాత్రం కుటుంబ జీవితానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. భవిష్యత్తులో ఆమె మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుందా.? అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.