
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. రీసెంట్ డేస్ లో బాలకృష్ణ చేసిన సినిమాల వరుస విజయాలను అందుకుంటున్నాయి. నందమూరి నటసింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు.

60 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో వెండితెరపై సందడి చేస్తున్నారు. మాస్ యాక్షన్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నారు. చివరిగా బాలకృష్ణ అఖండ 2 సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది.

ఇటీవల వరుసగా 5 సినిమాలతో రూ.100 కోట్లపైగా కలెక్షన్స్ రాబట్టారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ అవార్డ్ సైతం స్వీకరించారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ కొత్త సినిమా గురించి ఓ ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బాలకృష్ణ కృష్ణ సరసన నాలుగు సినిమాలు చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె ఇప్పటికే మూడు సినిమాల్లో బాలయ్యకు జోడీగా నటించింది. ఇక ఇప్పుడు నాలుగోసారి నటిస్తుంది. ఆమె ఎవరో కాదు నయనతార. గతంలో బాలయ్యబాబుతో కలిసి మూడు సినిమాల్లో నటించింది ఈ అమ్మడు.

ఆ మూడు సినిమాలు మంచి విజయలను అందుకున్నాయి.గతంలో సింహ, జై సింహ, శ్రీరామరాజ్యం సినిమాల్లో నయన్ బాలయ్య బాబుతో కలిసి నటించింది. ఇక ఇప్పుడు నాలుగో సారి బాలకృష్ణతో కలిసి నటిస్తుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.