
సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ల చిన్ననాటి చిత్రాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఒకప్పుడు చిన్నారులుగా కనిపించిన ఈ తారలు.. ఇప్పుడు వెండితెరపై స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతుండటం అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటుంది. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తండ్రి పక్కన ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్న ఈ చిన్నారి..ఈ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు.. బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుతోంది. ఇంతకీ ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా?

మరెవరో కాదు.. దక్షిణాది చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార. తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఎన్నో ఏళ్లుగా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, నటిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. ప్రస్తుతం నయనతారకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. 2003లో మలయాళ చిత్రం 'మనసీనక్కరే'తో ఆమె సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ భామ.. ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంది. అనంతరం తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోకి ప్రవేశించి తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తమిళంలో 'అయ్యా' సినిమాతో అడుగుపెట్టిన నయనతార.. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది.

తెలుగులోనూ అగ్ర హీరోల సరసన నటిస్తూ ప్రేక్షకులకు చేరువైంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కథానాయికగా సినిమాను తన భుజాలపై నడిపించగల సత్తా ఉందని పలు చిత్రాలతో నిరూపించింది. నయనతార కెరీర్‌లో చెప్పుకోదగిన చిత్రాల్లో 'శ్రీరామరాజ్యం' ఒకటి. ఈ సినిమాలో సీత పాత్రలో ఆమె చూపించిన అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో తన నటనతో ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి గాను ఆమె ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమా నయనతార కెరీర్‌లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.

ఆ తర్వాత 'రాజా రాణి', 'అరమ్', 'కోకో', 'విశ్వాసం', 'బిగిల్', 'నానుమ్ రౌడీ ధాన్' వంటి చిత్రాలతో తన స్టార్‌డమ్‌ను మరింత పెంచుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ విజయాలు అందుకుంటూ, దక్షిణాదిలో అత్యంత డిమాండ్ ఉన్న కథానాయికల్లో ఒకరిగా నిలిచింది. సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న నయనతార.. బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. నయనతారకు ఉన్న స్టార్‌డమ్‌కు ఆమె అందుకుంటున్న పారితోషికం కూడా నిదర్శనంగా నిలుస్తోంది. ఒక్కో సినిమాకు సుమారు రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.