
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నిలదొక్కుకోవడం అంత సులభమైన విషయం కాదు. అందం, అభినయం, టాలెంట్ ఉన్నా.. సరైన సమయంలో మంచి అవకాశాలు రావడం కూడా చాలా ముఖ్యం. అందుకే ఒకప్పుడు వరుస సినిమాలతో సందడి చేసిన చాలామంది హీరోయిన్లు.. ఆ తర్వాత క్రమంగా ఇండస్ట్రీకి దూరమైపోయారు. కొందరు పూర్తిగా కనుమరుగైపోగా.. మరికొందరు సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు. అలాంటి హీరోయిన్ల జాబితాలో పూనమ్ బజ్వా కూడా ఒకరు. ఒకప్పుడు తన క్యూట్ లుక్, చక్కని చిరునవ్వు, గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ..

ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడూ తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. పూనమ్ బజ్వా తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది హీరో నవదీప్ నటించిన సినిమాతో. ఆ తర్వాత ‘ప్రేమంటే ఇంతే’ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తన అందం, స్క్రీన్ ప్రెజెన్స్‌తో అప్పట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘బాస్’ సినిమాలో నాగార్జునతో కలిసి కనిపించింది.

అయితే ఈ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా కాకుండా హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో నటించింది. అనంతరం అల్లు అర్జున్ నటించిన ‘పరుగు’ సినిమాలోనూ కీలకమైన పాత్రలో కనిపించి మెప్పించింది. ఈ సినిమాలో హీరోయిన్ సిస్టర్‌గా నటించింది. తెలుగుతో పాటు పూనమ్ బజ్వా తమిళ చిత్ర పరిశ్రమలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ పలు సినిమాల్లో హీరోయిన్‌గా, ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించింది. అంతేకాదు.. కన్నడ, మలయాళ సినిమాల్లోనూ కనిపించి దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమైంది.

అయితే తెలుగులో మాత్రం ఆమె కెరీర్ క్రమంగా నెమ్మదించింది. చివరిగా బాలకృష్ణ నటించిన ‘ఎన్.టి.ఆర్. కథానాయకుడు’ సినిమాలో కనిపించింది. ఈ చిత్రంలో గారపాటి లోకేశ్వరి పాత్రలో నటించింది. ప్రస్తుతం పూనమ్ బజ్వా సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. తన ఫొటోషూట్స్‌కు సంబంధించిన చిత్రాలు, వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా గ్లామరస్ ఫొటోల్లో పూనమ్ బజ్వా లుక్ చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఎలా ఉందో.. ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తోందంటూ ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే పూనమ్ బజ్వా వ్యక్తిగత జీవితానికి సంబంధించి గతంలో కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘ఓం 3D’ సినిమాకు దర్శకత్వం వహించిన సునీల్ రెడ్డితో ఆమెకు రహస్యంగా వివాహం జరిగిందంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై పూనమ్ బజ్వా నుంచి ఎలాంటి స్పష్టమైన అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఆ వార్తలు నిజమా? కాదా? అనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు.