
రాకింగ్ స్టార్ యష్.. పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని సాధారణ కుర్రాడు నటనపై ఆసక్తితో ఇంట్లో నుంచి పారిపోయాడు. మొదట్లో యాంకర్ గా పనిచేసిన యష్.. ఆ తర్వాత సీరియల్స్ లో హీరోగా కనిపించాడు.

ఆ తర్వాత హీరోగా చిన్న చిన్న సినిమాల్లో నటించాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమా అతడి కెరీర్ మలుపు తిప్పింది. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఒక్క మూవీతోనే పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు.

కేజీఎఫ్ 1, 2 చిత్రాలతో సంచలన విజయం అందుకున్న యష్.. ఇప్పుడు టాక్సిక్ చిత్రంలో నటిస్తున్నాడు. నివేదికల ప్రకారం యష్ ఈ చిత్రానికి దాదాపు 50 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాడు. అయితే, యష్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. అతని మొత్తం సంపాదన చాలా ఎక్కువగా ఉండవచ్చనిఅంటున్నారు.

పారితోషికంతోపాటు సహ నిర్మాత కావడం వల్ల ఈ సినిమా కోసం దాదాపు రూ.150 కోట్ల వరకు తీసుకుంటున్నారని టాక్. "టాక్సిక్" చిత్రాన్ని యష్, వెంకట్ కె. నారాయణ్ నిర్మిస్తున్నారు. ఈద్, ఉగాది, గుడి పద్వా వంటి పండుగల సందర్భంగా మార్చి 19, 2026న థియేటర్లలో విడుదల కానుంది.

ఇటీవల విడుదలైన టీజర్ యూట్యూబ్ లో సెన్సేషన్ అయ్యింది. మాస్ యాక్షన్ నేపథ్యంలో ఈ చిత్రం థియేటర్లలో విధ్వంసం సృష్టించనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో కియార అద్వాని, నయనతార, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.