అంత పెద్ద హీరోయిన్.. నా సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి కూడా రెడీ అయ్యింది

Updated on: Mar 20, 2026 | 9:18 PM

దర్శకుడు జయంత్ సి పరాన్జీ, ఓ ఇంటర్వ్యూ లో తన సినీ ప్రస్థానం గురించి అనేక వివరాలను వెల్లడించారు. ప్రేమించుకుందాం రా, బావగారు బాగున్నారా, ప్రేమంటే ఇదేరా వంటి వరుస విజయాల తర్వాత కూడా తాను ఎప్పుడూ విజయాన్ని తలకెక్కించుకోలేదని తెలిపారు.

1 / 5
దర్శకుడు జయంత్ సి పరాన్జీ.. ఒకప్పుడు వరుస హిట్స్ తో టాలీవుడ్ టాక్ డైరెక్టర్ గా రాణించారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించారు జయంత్ సి పరాన్జీ.. కానీ ఆతర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో జయంత్ సి పరాన్జీ సినిమాల స్పీడ్ తగ్గించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో జయంత్ సి పరాన్జీ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

2 / 5
జయంత్ సి పరాన్జీ తొలినాళ్లలో ప్రేమించుకుందాం రా, బావగారు బాగున్నారా, ప్రేమంటే ఇదేరా వంటి వరుస విజయాలను అందించారు. రా సెంటిమెంట్ పాటించారని అడిగినప్పుడు, అది యాదృచ్చికమే తప్ప సెంటిమెంట్ కాదని జయంత్ స్పష్టం చేశారు. మూడు వరుస హిట్ల తర్వాత కూడా తాను ఎప్పుడూ విజయాన్ని తలకెక్కించుకోలేదని, తన దృష్టి ఎప్పుడూ తదుపరి ప్రాజెక్టుపైనే ఉండేదని తెలిపారు.

3 / 5
రావోయి చందమామ చిత్రం తన మొదటి ఫ్లాప్ హా నిలిచిందని, దీనికి ప్రధాన కారణం స్క్రిప్ట్ బలహీనత అని జయంత్ సి పరాన్జీ అన్నారు. అన్ అఫైర్ టు రిమెంబర్ అనే 1950ల నాటి ఆంగ్ల చిత్రం నుండి ప్రేరణ పొందినప్పటికీ, స్క్రిప్ట్‌ను సరిదిద్దడానికి సమయం దొరకలేదని పేర్కొన్నారు. విడుదల తేదీ దగ్గర పడటంతో, టీమ్ ఆతృతగా పనిచేసిందని, అయితే ఫ్లాప్‌కు పూర్తి బాధ్యత తనదేనని ఆయన అన్నారు. ఈ చిత్రం విడుదలైన వారం రోజుల ముందే బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ "మన్" చిత్రం విడుదల కావడం కూడా ఒక మైనస్ అయ్యిందని, దాని కాపీ అని విమర్శలు వచ్చాయని చెప్పారు.

4 / 5
అలాగే హీరోయిన్ ఐశ్వర్య రాయ్‌తో తన స్నేహం గురించి జయంత్ సి పరాన్జీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మిస్ వరల్డ్ అయినప్పటి నుంచి తనకు ఐశ్వర్య తెలుసని చెప్పారు. "ప్రేమంటే ఇదేరా" సినిమా కోసం ఐశ్వర్యను సంప్రదించినప్పుడు, ఆమె స్క్రిప్ట్ విని కన్నీళ్లు పెట్టుకుని సినిమా చేయడానికి వెంటనే డేట్స్ ఇస్తానని చెప్పిందని, అయితే అంతకు ముందు ఆమెకు రెండు హిందీ ఫ్లాపులు ఉండటంతో పరిశ్రమ వెనుకాడిందని తెలిపారు. అప్పుడు ఆమె స్థానంలో ప్రీతి జింటాను తీసుకున్నట్లు చెప్పారు.

5 / 5
ఆ తర్వాత "తాల్", "హమ్ దిల్ దే చుకే సనమ్" వంటి భారీ విజయాల తర్వాత, ప్రీతి జింటాను ఐటమ్ సాంగ్ కోసం అడగడానికి తాను ముంబై వెళ్ళినప్పుడు, ఐశ్వర్య తానే స్వచ్ఛందంగా ముందుకు వచ్చిందని జయంత్ గుర్తు చేసుకున్నారు. దత్ గారికి ఫోన్ చేసి ఐశ్వర్య ఐటమ్ సాంగ్ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పగా, ఆయన ఎంతో సంతోషించారని వివరించారు. వారి స్నేహం చాలా కాలంగా కొనసాగుతోందని, అయితే వారి కెరీర్ మార్గాలు వేరవడం వల్ల మళ్లీ కలిసి పనిచేయలేకపోయారని జయంత్ సి పరాన్జీ తెలిపారు.

Follow Us