Actress: అసలేం మారలేదు మావా.. సీనియర్ హీరోయిన్ నిరోషా గుర్తుందా.. ? ఇప్పుడేం చేస్తుందంటే..

Updated on: Dec 24, 2025 | 2:22 PM

ఒకప్పుడు తెలుగు తెరపై అందం, అభినయంతో కట్టిపడేసిన తారలు చాలా మంది ఉన్నారు. చూడచక్కని రూపం, సహజ నటనతో అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న హీరోయిన్స్.. ఇప్పుడు సహయ నటీమణులుగా కనిపిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సీనియర్ హీరోయిన్ గురించి తెలుసుకుందామా.

1 / 5
హీరోయిన్ నిరోషా రాధ గుర్తుందా.. ? సింధూర పువ్వు సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది ఈ అమ్మడు. ఆమె సీనియర్ హీరోయిన్ రాధిక చెల్లెలు కూడా. అలాగే ప్రముఖ హీరో ఎం.ఆర్.రాధ కూతురు సైతం.

2 / 5
రాధిక సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారిన తర్వాత నిరోషా వెండితెరకు పరిచయం అయ్యింది. అగ్ని నక్షత్రం సినిమాతో నటిగా తెరంగేట్రం చేసిన ఆమె.. తర్వాత వరుస అవకాశాలు అందుకుంది. సింధూర పువ్వు సినిమాతో ఆమెకు తెలుగులో మంచి ఫేమ్ వచ్చింది.

3 / 5
తెలుగులో ముద్దుల మావయ్య, నారీ నారీ నడుమ మురారి, స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్, కొబ్బరి బోండాం, డిటెక్టివ్ నారద, అత్తింట్లో అద్దె మొగుడు వంటి సినిమాల్లో నటించింది. మెగాస్టార్ చిరంజీవి, రాజేంద్రప్రసాద్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

4 / 5
కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సింధూర పువ్వు సినిమాలో తనతోపాటు నటించిన రాంకీనే ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న నిరోషా.. ఇప్పుడు తిరిగి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సినిమాలతోపాటు సీరియల్స్ సైతం చేస్తుంది.

5 / 5
తెలుగు, తమిళంలో సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ అమ్మడు.. తాజాగా ఆమె లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.