
తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూనే తనదైన నటనతో రామ్ చరణ్ తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఆయనకు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో పాటు చరణ్‌కు గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఇటీవలే పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చరణ్ ఇప్పుడు మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.

ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ కెరీర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే.. ఆయనతో కలిసి నటనలో శిక్షణ తీసుకున్న ఓ హీరోయిన్, అదే చరణ్ నటించిన సినిమాలో ఆయనకు తల్లి పాత్రలో కనిపించడం. అప్పుడు చరణ్ క్లాస్ మెట్ గా ఉన్న ఆమె ఆతర్వాత చరణ్ కు తల్లిగా నటించింది. అంతే కాదు ఆమె తెలుగులో తిరుగులేని హీరోయిన్ కూడా.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు అందాల భామ శ్రియ శరన్.

రామ్ చరణ్, శ్రియా శరన్ ఇద్దరూ నటనకు సంబంధించిన శిక్షణను ఒకే చోట తీసుకున్నారని గతంలో పలు సందర్భాల్లో ప్రస్తావన వచ్చింది. అలా ఒకే సమయంలో నటన నేర్చుకున్న వీరిద్దరూ క్లాస్‌మేట్స్‌గా మారారు. అయితే సినిమాల్లోకి వచ్చిన తర్వాత మాత్రం ఇద్దరి ప్రయాణాలు పూర్తిగా భిన్నమైన దిశల్లో సాగాయి. శ్రియా శరన్ చరణ్ కంటే ముందుగానే సినీ రంగంలోకి ప్రవేశించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. తెలుగు, తమిళ, హిందీతో పాటు పలు భాషల్లో నటిస్తూ సుదీర్ఘమైన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.

మరోవైపు రామ్ చరణ్ మెగా వారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి, తమ సినిమాలతో బిజీగా మారిపోయారు. అయితే వీరిద్దరి మధ్య ఓ క్రేజీ ఇన్సిడెంట్ ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన చిన్ననాటి సన్నివేశంలో శ్రియా శరన్ తల్లి పాత్రలో కనిపించారు. ఒకప్పుడు క్లాస్‌మేట్స్‌గా నటన నేర్చుకున్న వీరిద్దరూ.. తర్వాత ఒక సినిమాలో తల్లి, కొడుకులుగా కనిపించడం అభిమానులకు ఆసక్తిని కలిగించింది. ఇక శ్రియా శరన్ విషయానికి వస్తే.. వయసు పెరుగుతున్నా ఆమెకున్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

ప్రస్తుతం కథకు, పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ నటిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. రామ్ చరణ్, శ్రియా శరన్ ఇద్దరూ క్లాస్‌మేట్ నుంచి ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’లో తల్లి-కొడుకులుగా కనిపించడం నిజంగా సినీ అభిమానులకు ఆసక్తికరమైన విషయమే. ఇదే ఈ పాత విషయమే అయినప్పటీకి ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా అవుతుంది.