
అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ చిన్నది తాజాగా ట్రెడిషనల్ లుక్‌లో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

తెలుగు బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు టాప్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతుంది. తన మాటతీరు, అందం, అల్లరితనంతో అందరి మనసు దోచేసుకుంటుంది.

బుల్లితెరపై వరసగా షోలు, ఈవెంట్స్ చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది ఈ ముద్దుగుమ్మ. పటాస్ ప్రోగ్రాం ద్వారా తెలుగు అభిమానులకు పరిచయం అయిన ఈ చిన్నది, తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

తర్వాత వరసగా షోలు చేయడమే కాకుండా, చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది. ఒక వైపు సినిమాలు మరో వైపు షోలతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టి్వ్‌గా ఉండే ఈ చిన్నది , ఎప్పటికప్పుడు తన బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేస్తుంది. తాజాగా పట్టు పరికిణిలో అందంగా ముస్తాబైన ఫొటోస్ షేర్ చేయగా, అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.