
గంగోత్రి మూవీ తర్వాత అల్లు అర్జున్ ఆర్య మూవీతో తెలుగు అభిమానుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాలోబన్నీ సరసన నటి అనురాధ మెహతా హీరోయిన్‌గా గీత పాత్రలో నటించారు. ఈ బ్యూటీ ఈ మూవీతో తన కంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

అందం, అభినయం, బ్యూటిపుల్ కళ్లతో ప్రతి ఒక్కరినీ మాయ చేసింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా గీత పాత్రలో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. అచ్చం పల్లెటూరి అమ్మాయిలా, చాలా సింపుల్‌గా కనిపించి ప్రతి ఒక్కరి మనసులో చోటు సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈ అమ్మడు చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.

ముఖ్యంగా, నువ్వంటే నాకిష్టం, మహారాజ శ్రీ, వేడుక, వంటి సినిమాలతో తెలుగు అభిమానులను ఆకట్టుకుంది. అంతే కాకుండా ఈ బ్యూటీ కన్నడలో అజయ్, హుంగనసు అనే రెండు సినిమాలు చేసింది. అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ బ్యూటీకి అదృష్టం మాత్రం అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఈ బ్యూటీ చేసిన చిన్న చిన్న పొరపాట్లే ఈ అమ్మడు కెరీర్‌కు అడ్డంకిగా మారాయి. ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ప్రతి విషయం వాళ్ల అమ్మే చూసుకునేదంట. అయితే ఆమె పెట్టిన రిస్ట్రక్షన్స్ వలన నిర్మాతలు, డైరెక్టర్స్ ఈ బ్యూటీని దూరం పెట్టారంటూ అప్పట్లో అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే ఈ బ్యూటీ 2008లో హొంగనసు అనే సినిమా తర్వాత మళ్లీ కనిపించలేదు. ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీ సినిమాలకు గుడ్ బై చెప్పింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బ్యూటీకి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. దీంతో చాలా మంది ఈ ముద్దుగుమ్మ గురించి నెట్టింట్లో చర్చించడం మొదలు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో కూడా అందుబాటులో లేకపోవడంతో, ఆర్య మూవీ హీరోయిన్ ఏమైంది? ఎక్కడుంది అంటూ నెట్టింట్లో సెర్చ్ చేయడం ప్రారంభించారు. కానీ ఈ బ్యూటీ మాత్రం ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లి పోయింది. కనీసం వివాహం జరిగిందా ? లేదా లాంటి ఏ సమాచారం లేదు. దీంతో ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఏదో ఒక న్యూస్, ముఖ్యంగా ఈ అమ్మడు గుర్తుందా అంటూ అనేక వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.