చెప్పాపెట్టకుండా ఆ షో నుంచి తీసేశారు.. వాళ్లకి కృతజ్ణతే లేదు.. ఉదయభాను ఆవేదన

Updated on: May 17, 2026 | 10:46 AM

ఇప్పుడంటే చాలా మంది యాంకర్ రాణిస్తున్నారు కానీ ఒకప్పుడు యాంకర్ అంటే సుమ, జాన్సీ, ఉదయభాను పేర్లే వినిపించేవి. ఈ ముగ్గురు కలిసి స్టేజ్ పై చేసే హడావిడి అంత ఇంతా కాదు ముఖ్యంగా ఉదయభాను.. ఈ స్టార్ యాంకర్ చాలా మంది ఫేవరెట్ యాంకర్..

1 / 5
ఇప్పుడంటే చాలా మంది యాంకర్ రాణిస్తున్నారు కానీ ఒకప్పుడు యాంకర్ అంటే సుమ, జాన్సీ, ఉదయభాను పేర్లే వినిపించేవి. ఈ ముగ్గురు కలిసి స్టేజ్ పై చేసే హడావిడి అంత ఇంతా కాదు ముఖ్యంగా ఉదయభాను.. ఈ స్టార్ యాంకర్ చాలా మంది ఫేవరెట్ యాంకర్.. ఎన్నో సూపర్ హిట్ ప్రోగ్రామ్స్ కు ఉదయభాను యాంకర్ గా వ్యవహరించారు. ఉదయభాను చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆర్. నారాయణమూర్తి దర్శకత్వంలో వచ్చిన 'ఎర్రసైన్యం' సినిమాతో నటిగా ఆమె కెరీర్ ప్రారంభమైంది.

2 / 5
ఆ తర్వాత 'కొండవీటి సింహాసనం', 'ఖైదీ బ్రదర్స్', 'శ్రావణమాసం' వంటి పలు చిత్రాల్లో నటించారు. కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లోనూ కనిపించి మెప్పించారు. సినిమాల కంటే ఉదయభానుకు టెలివిజన్ రంగమే లైఫ్ ఇచ్చింది. వన్‌మెన్ షో లాగా అప్పట్లో ఈమె యాంకరింగ్‌తో టీవీ షోలను నడిపించేవారు. ఈటీవీలో వచ్చిన హృదయాంజలి షో ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 'ఫ్యామిలీ సర్కస్', 'ఢీ' (డ్యాన్స్ షో), 'జాక్‌పాట్', 'సాహసం చేయరా డింభకా' వంటి ఎన్నో సూపర్ హిట్ షోలకు ఆమె హోస్ట్‌గా వ్యవహరించారు.

3 / 5
వేగంగా, స్పష్టంగా తెలుగు మాట్లాడటం, ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, గ్లామర్ అప్పట్లో ఉదయభాను మార్క్ యాంకరింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాయి. ఆ సమయంలో టెలివిజన్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే యాంకర్‌గా ఆమె రికార్డు సృష్టించారు.ఉదయభాను జీవితంలో ఎన్నో ఆప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోవడం, కుటుంబ సమస్యల వల్ల ఎన్నో వ్యక్తిగత ఇబ్బందులను ఎదుర్కొన్నారు. 

4 / 5
ఇటీవలి కాలంలో ఆమె మళ్లీ మీడియా ముందుకు వస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ , టెలివిజన్ ఇండస్ట్రీలో ఉండే నెపోటిజం, గ్రూపిజం గురించి, తాను ఫేస్ చేసిన పాలిటిక్స్ గురించి ఇంటర్వ్యూలలో బాహాటంగానే మాట్లాడుతుంటారు. ఎంతమంది ఇబ్బంది పెట్టినా తాను ఒక ఫైటర్ లాగా నిలబడ్డానని తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అప్పట్లో యాంకరింగ్ అంటే చాలా ఆర్గానిక్‌గా ఉండేది. ఇప్పుడంతా స్క్రిప్టెడ్ అయిపొయింది అని ఆమె తెలిపారు.

5 / 5
ఒకప్పుడు ఢీ డాన్స్ షో అనే పేరుకి తగ్గట్టుగానే ఫుల్ డాన్స్ ఉండేది. ఇప్పుడు అలా లేదు ఎదో కామెడీ షోలా చేశారు. ఉదయం మొదలు పెడితే తిరిగి ఉదయం అయ్యే వర షో చేసేవాళ్లం.. గంటల తరబడి ఎక్కడా ఎనర్జీ తగ్గకుండా ఆ షోని భుజాలపై మోస్తూ కష్టపడి చేశాం.. కానీ వాళ్లకి ఏ మాత్రం గ్రాటిట్యూడ్ లేదు. కనీసం తనకి ఇప్పటి వరకూ ఎందుకు తీసేశారో కూడా చెప్పలేదని.. వాళ్లకి కృతజ్ణతే లేదని అన్నారు ఉదయభాను.

Follow Us