
అందాల ముద్దుగుమ్మ ఆలియాకు బాలీవుడ్ లోనే కాదు, టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. త్రిబుల్ ఆర్ సినిమాతో ఈ అమ్మడు మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. తాజాగా ఈ బ్యూటీ పింక్ శారీలో తన అందాలతో మతిపొగొట్టింది. సింపుల్ గానే కనిపిస్తూ కుర్రకారుకు పిచ్చెక్కించింది.

శుక్రవారం బాలీవుడ్ నటి కరీనా కపూర్ రిలేటివ్, నటుడు ఆదర్ జైన్ వివాహం ప్రముఖ వ్యాపార వేత్త మ్యాన్ హ్యారీ అద్వానీ కుమార్తె అలేఖ అద్వానీతో జరిగింది. దీంతో ఈ వివాహ వేడుకకు చాలా మంది సెలబ్రిటీలు హాజరయ్యారు.

ఇందులో భాగంగా బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ ఆలియా, రణ్ బీర్ కపూర్ కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. ఈ క్రమంలో నటి ఆలియా పింక్ కలర్ శారీలో చాలా స్పెషల్ గా కనిపించింది.

పింక్ శారీలో చూడటానికి అందంగా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో షేర్ చేయడంతో అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ వివాహ వేడుకకు రణ్ బీర్ కపూర్,బ్లాక్ సూట్ , ట్రౌజర్స్ వేసుకున్నాడు. వీరి జంట అక్కడున్నవారందరినీ ఆకర్షించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.