డైరెక్టర్‌కు పిచ్చి పట్టిందా.? ఆ హీరో పక్కన ఈ అమ్మాయా? అంటూ మాట్లాడుకున్నారు

Updated on: Nov 03, 2026 | 9:20 AM

టాలీవుడ్ నటి సంగీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరైంది. ముఖ్యంగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘ఖడ్గం’ సినిమా సంగీత కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచిపోయింది.

1 / 5
 టాలీవుడ్ నటి సంగీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరైంది. ముఖ్యంగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘ఖడ్గం’ సినిమా సంగీత కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఈ సినిమాలో రవితేజ సరసన నటించిన సంగీతకు మంచి గుర్తింపు లభించింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న అనుభవాలు, మొదటి రోజు జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటన గురించి ఆమె గుర్తు చేసుకున్నారు.

2 / 5
 సంగీత కెరీర్‌లో ఖడ్గం సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా తన జీవితంతో పాటు కెరీర్‌ను కూడా మార్చేసిందని ఆమె వెల్లడించారు. ఈ చిత్రంలో ఎన్నో మంచి అనుభవాలు ఎదురయ్యాయని, వాటిలో ఒక్కదాన్ని మాత్రమే ప్రత్యేకంగా చెప్పడం కష్టమని తెలిపారు. ఖడ్గం షూటింగ్ ప్రారంభమైన మొదటి రోజు తనకు ఎదురైన అనుభవాన్ని సంగీత గుర్తు చేసుకున్నారు. అప్పట్లో దర్శకుడు కృష్ణవంశీ తప్ప యూనిట్‌లో తనకు మరెవరూ పరిచయం లేదని చెప్పారు. దీంతో షూటింగ్ మొదటి రోజు ఏం జరుగుతుందోనని కొంత ఆందోళనకు గురైనట్లు తెలిపారు.

3 / 5
 షూటింగ్ కోసం మేకప్ వేయించుకున్న తర్వాత అద్దంలో తనను తాను చూసుకుని ఆశ్చర్యపోయానని సంగీత చెప్పారు. తన ముఖానికి పసుపు రంగు మేకప్ వేయడంతో పాటు, జుట్టును నిటారుగా, జిడ్డుగా కనిపించేలా చేశారని గుర్తు చేసుకున్నారు. ఆ మేకప్ తనకు ఏమాత్రం నచ్చలేదని, నటీనటులకు మేకప్ ప్లస్ కావాలి కానీ తన విషయంలో మాత్రం మైనస్‌గా అనిపించిందని తెలిపారు. మేకప్ పూర్తయ్యాక తన రూపాన్ని చూసి బయటకు వచ్చి షాట్ ఇవ్వడానికి కూడా ఇబ్బందిపడ్డానని సంగీత వెల్లడించారు. చివరకు దర్శకుడు కృష్ణవంశీని లోపలికి వచ్చి తన లుక్ చూడాలని కోరినట్లు చెప్పారు.

4 / 5
 తన లుక్ చూసిన కృష్ణవంశీ మాత్రం అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారని సంగీత గుర్తు చేసుకున్నారు. 'అరే.. బాగుందే! పర్ఫెక్ట్.. ఫెంటాస్టిక్.. అవుట్ ఆఫ్ ద వరల్డ్ యు ఆర్' అంటూ ఆయన ప్రోత్సహించారని తెలిపారు. దీంతో ఆయన మాటలు విని ఆశ్చర్యపోయానని, వెంటనే షూటింగ్ ప్రారంభించమని చెప్పారని వెల్లడించారు. దర్శకుడు తనను ఎంతగానో ప్రశంసించినప్పటికీ, బయట పరిస్థితి మాత్రం మరోలా ఉందని సంగీత చెప్పారు. యూనిట్ సభ్యులు బాగుందని చెబుతున్నా, అక్కడున్న కొందరు మాత్రం 'వంశీకి పిచ్చి పట్టిందా? ఈ అమ్మాయిని తీసుకున్నారేంటి? రవితేజ పక్కన ఈ అమ్మాయా?' అంటూ మాట్లాడుకోవడం విన్నానని తెలిపారు. ఆ మాటలు తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయని గుర్తు చేసుకున్నారు.

5 / 5
 ఖడ్గం సినిమా విడుదలైన తర్వాత కూడా వెంటనే థియేటర్‌లో చూడలేదని సంగీత తెలిపారు. చెన్నైలోని ఓ ప్రివ్యూ థియేటర్‌లో సినిమా చూసినప్పటికీ, అప్పట్లో దాని ప్రభావం తనకు పూర్తిగా అర్థం కాలేదన్నారు. అయితే సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు. ఖడ్గం సినిమా తన కెరీర్‌ను పూర్తిగా మార్చేసిందని సంగీత పేర్కొన్నారు. ఈ సినిమా ద్వారా తనకు మంచి గుర్తింపు రావడంతో పాటు, నటిగా ఎన్నో మంచి అనుభవాలు దక్కాయని తెలిపారు. అందుకే దర్శకుడు కృష్ణవంశీకి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటానని చెప్పారు. ఖడ్గం సినిమాలోని 'ఒక్క ఛాన్స్' డైలాగ్ గురించి ప్రస్తావించగా, అది చాలా భావోద్వేగంతో కూడుకున్న సన్నివేశమని సంగీత తెలిపారు. ఆ డైలాగ్‌ను ఏడుస్తూ చెప్పాల్సి ఉంటుందని, ఇప్పుడు మరోసారి చెప్పాలంటే కొంచెం కష్టమే అయినా ప్రయత్నిస్తానని సరదాగా స్పందించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us