
అందాల ముద్దుగుమ్మ రిద్ది కుమార్.. ఈ అమ్మడు రాజ్ తరుణ్ హీరోగా నటించిన లవర్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. లవర్ సినిమాలో అందం, అభినయంతో కట్టిపడేసింది రిద్ది కుమార్. చాలా కాలం గ్యాప్ తీసుకున్న తర్వాత ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాలో కీలకపాత్రలో కనిపించింది.

ఈ సినిమాలో ఆమె చేసింది చిన్న పాత్రే అయినా తన నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నది. రాధేశ్యామ్ సినిమాలో ఒక చిన్న పాత్రలు తళుక్కున మెరిసింది ఈ ముద్దుగుమ్మ. రాధేశ్యామ్ సినిమాలో అర్చరీ ప్లేయర్ గా కనిపించింది. ఈ బ్యూటికి అనుకున్నంతగా అవకాశాలు కూడా టాలీవుడ్ లో రావడం లేదు.

ఇటీవలే ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ సినిమాలో నటించింది. రాజా సాబ్ సినిమాలో ఓ హీరోయిన్ గా నటించింది కానీ ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. రాజాసాబ్ సినిమాలో గ్లామరస్ గా కనిపించి కవ్వించింది ఈ సుందరి.

కానీ తెలుగులో పెద్దగా ఆఫర్స్ అందుకోలేకపోతుంది. అలాగే అటు మలయాళంలోనూ వరుస ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా ఈ బ్యూటీ లేటేస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. నెట్టింట గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ కవ్విస్తుంది.

కెరీర్ తొలినాళ్లలో ఈబ్యూటీ గ్లామర్ రోల్స్ చేసేందుకు అంతగా ఆసక్తి చూపించలేదు. దీంతో ఈ భామకు అవకాశాలు అంతగా రావడం లేదని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం గ్లామర్ రోల్స్ లోనూ కనిపిస్తూ మెప్పిస్తుంది రిద్ది కుమార్.