70ఏళ్లు వచ్చిన పర్లేదు.. నాకు నచ్చితే రెండో పెళ్ళికి రెడీ : టాలీవుడ్ హీరోయిన్

Updated on: Sep 01, 2026 | 4:22 PM

ప్రేక్షకులకు హీరోయిన్ ప్రేమ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చినప్పటికీ, హోమ్లీ లుక్స్‌తో పాటు అద్భుతమైన నటనతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సోషియో ఫాంటసీ మూవీ ‘దేవి’ ప్రేమ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది.

1 / 5
ప్రేక్షకులకు హీరోయిన్ ప్రేమ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చినప్పటికీ, హోమ్లీ లుక్స్‌తో పాటు అద్భుతమైన నటనతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సోషియో ఫాంటసీ మూవీ ‘దేవి’ ప్రేమ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది. పాము క్యారెక్టర్‌లో, దేవిగా ఆమె చూపించిన నటన, పర్సనాలిటీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

2 / 5
ఆమె నటించిన దేవి సినిమాను ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఎవ్వరూ మర్చిపోలేరు. గతంలో వరుసగా సినిమాలు చేసిన ప్రేమ ఇప్పుడు సినిమాలు తగ్గించారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడలోనూ సినిమాలు చేసి మెప్పించారు ప్రేమ. హీరోయిన్ గానే కాదు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోను ఆకట్టుకున్నారు ప్రేమ. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలై పెట్టి  సినిమాలు చేస్తున్నారు ప్రేమ. తాజాగా ప్రేమ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

3 / 5
క్యాన్సర్, విడాకులు, రెండో పెళ్లి వంటి విషయాలపై ఆమె స్పష్టతనిచ్చారు. గతంలో తనకు క్యాన్సర్ వచ్చినట్లు వచ్చిన వార్తలు కేవలం నిరాధారమైన పుకార్లు మాత్రమేనని ప్రేమ స్పష్టం చేశారు. తాను న్యూజిలాండ్‌లో ఉన్న సమయంలో ఈ వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయని, అయితే అవి నిజం కాదని ప్రేమ తెలిపారు. తప్పుడు వార్తలు తనను మరింత బలపడేలా చేశాయని, తన తల్లిదండ్రుల మద్దతు కూడా తనలో ధైర్యాన్ని నింపిందని ప్రేమ అన్నారు.

4 / 5
గత ఏడాది తన రెండో పెళ్లి గురించి వచ్చిన వార్తలపై కూడా ప్రేమ స్పందించారు. పెళ్లి అనేది తన వ్యక్తిగత నిర్ణయమని, తన జీవితానికి తోడుగా నిలిచే మంచి వ్యక్తి దొరికితే తప్పకుండా వివాహం చేసుకుంటానని తెలిపారు. 70 ఏళ్ల వయసులో కూడా పెళ్లి చేసుకోవచ్చని, ఇందులో ఎలాంటి తప్పు లేదని ఆమె తన ఆలోచనను వెల్లడించారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

5 / 5
ప్రేమ తన కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడుతూ.. తన తండ్రి కేఎస్ఆర్టీసీ టూరిజంలో డ్రైవర్‌గా పనిచేశారని, తల్లి గృహిణి అని తెలిపారు. తన తల్లి షూటింగ్స్‌కు తనతో పాటు వచ్చేవారని, నటన పట్ల తనలో ఆసక్తిని పెంచారని చెప్పారు. మొదట్లో తన తండ్రి నటనను ప్రోత్సహించకపోయినా, రెండో సినిమాతో స్టేట్ అవార్డు గెలుచుకున్న తర్వాత ఆయన చాలా గర్వపడ్డారని, డ్రైవర్ కూతురు స్టార్ హీరోయిన్ అయిపోయింది అని క్యాప్షన్లు కూడా వచ్చేవని ప్రేమ గుర్తు చేసుకున్నారు. 

Loading...
Unable to load recommendations.
Follow Us