పెళ్లి కాకుండా పిల్లల్ని కనడంలో అసలు తప్పేలేదు.. టాలీవుడ్ హీరోయిన్ అంతమాట అనేసిందేంటీ.!!

Updated on: Apr 26, 2026 | 6:51 AM

ప్రేమలు పెళ్లిళ్లు , విడాకులు అనేవి సెలబ్రెటీల లైఫ్ లో చాలా కామన్ అయ్యాయి. ఎవరు ఎప్పుడు పెళ్లి అనౌన్స్ చేస్తారో అలాగే ఎవరు ఎప్పుడు విడిపోతున్నట్టు అనౌన్స్ చేస్తారో చెప్పడం కష్టంగా మారింది. తాజాగా ఓ హీరోయిన్ పిల్లల్ని కనాలంటే పెళ్లితో పనిలేదు అని చెప్పు షాక్ ఇచ్చింది.

1 / 5
రోజులు మారాయి.. ఇప్పుడు లివింగ్ రిలేషన్ , లవ్ ఎఫైర్స్, పెళ్లిళ్లు అనేవి చాలా కామన్ అయ్యాయి. ఎక్కువగా సినీ సెలబ్రెటీల విషయంలో ఎక్కువగా ఇలాంటి వార్తలు వింటుంటాం. కొంతమంది పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం పెళ్లి పేరు ఎత్తకుండా సైలెంట్ గా ఉంటారు. మరికొంతమంది లవ్ ఎఫైర్స్ తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు. 

2 / 5
ఇక చాలా మంది హీరోయిన్స్ నాలుగు పదుల వయసులోనూ పెళ్లి పేరు ఎత్తకుండా సైలెంట్ గా ఉంటున్నారు. కొంతమంది వరుస సినిమాలతో బిజీగా ఉంటే మరికొంతమంది మాత్రం రేస్ లో వెనకపడుతున్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పుడు ఆచితూచి సినిమాలు చేస్తుంది. తెలుగు తమిళ్ లో మంది గుర్తింపు తెచ్చుకుంది ఆ వయ్యారి భామ.. ఆమె ఎవరో కాదు. 

3 / 5
ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించిన భామల్లో అందాల ముద్దుగుమ్మ నిత్యామీనన్ ఒకరు. ఈ చిన్నది అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి పేక్షకులను మెప్పించింది. తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. అలాగే తమిళ్ లోనూ బడా హీరోల పక్కన సినిమాలు చేసింది నిత్యామీనన్. ప్రస్తుతం ఈ చిన్నది తమిళ్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తుంది. 

4 / 5
ఇదిలా ఉంటే నిత్యామీనన్ ఇంతవరకు పెళ్లి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. గతంలో నిత్యామీనన్ పెళ్లి గురించి రకరకాల వార్తలు వచ్చాయి కూడా.. ప్రస్తుతం సింగిల్‌గా లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మడు పెళ్లి పై తనకున్న అభిప్రాయం చెప్పుకొచ్చింది. పెళ్లి అనేది జీవితంలో ఒక భాగమే తప్ప, అదే జీవితం కాదు అంటుంది ఈ అందాల భామ. 

5 / 5
అలాగే ప్రెగ్నెన్సీ అనేది పెళ్ళికి ముందా తర్వాతా అన్నది అసలు ముఖ్యమే కాదని చెప్పుకొచ్చింది. గతంలో నిత్యా అమ్మమ్మ పెళ్లిగురించి ఒత్తిడి తెచ్చేది అని ఇప్పుడు ఇంట్లో వాళ్ల వల్ల పెద్దగా ఇబ్బంది లేదు అంటూ తెలిపింది. పెళ్లితో సంబంధం లేకుండా పిల్లల్ని కనడంలో అసలు తప్పేలేదని తెలిపింది నిత్యా, పిల్లలు కావాలనుకుంటే పెళ్లే చేసుకోవాల్సిన అవసరం లేదని, అది పూర్తిగా ఒక వ్యక్తిగత నిర్ణయమని చెప్పుకొచ్చింది ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

Follow Us