బిగ్ బాస్ వల్ల నాపై నీచంగా కామెంట్స్ చేశారు.. తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేశా

Updated on: Oct 09, 2026 | 9:14 PM

ఒకప్పుడు తన అందచందాలతో పాటు అభినయంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి నమిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల తార.. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లోనూ నటించి అభిమానులను సంపాదించుకుంది.

1 / 5
ఒకప్పుడు తన అందచందాలతో పాటు అభినయంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి నమిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల తార.. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లోనూ నటించి అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబ జీవితానికి ప్రాధాన్యత ఇస్తున్న నమితకు సంబంధించిన పాత ఇంటర్వ్యూ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా తమిళ బిగ్ బాస్ షోలో తన అనుభవాలు, సోషల్ మీడియాలో ఎదురైన వ్యక్తిగత దూషణల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

2 / 5
తమిళ బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న నమిత.. ఆ కార్యక్రమంలో పోటీదారులు ఎలా వ్యవహరిస్తారనే విషయంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నవారికి ప్రధానంగా రెండు మార్గాలు ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఒకటి తమ నిజమైన వ్యక్తిత్వాన్ని బయటపెడుతూ సహజంగా ఉండటం. అయితే అలా ఉన్నప్పుడు విమర్శలు, అవమానాలు, అపార్థాలు ఎదుర్కోవాల్సి రావచ్చని తెలిపారు. మరోవైపు, ప్రేక్షకుల అభిరుచిని అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా వ్యవహరించడం రెండో మార్గమని వివరించారు.

3 / 5
మూడు నెలల పాటు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రవర్తించడం, అవసరమైన సందర్భాల్లో భావోద్వేగాలను ప్రదర్శించడం ద్వారా వారి సానుభూతిని పొందవచ్చని పేర్కొన్నారు. కొందరు ఏడుస్తూ ప్రేక్షకులకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తే, మరికొందరు తమ డ్యాన్స్‌తో ఆకట్టుకోవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే నిజాయితీగా ఉంటూ తమ సహజ స్వభావంతో వ్యవహరించే వారిని అందరూ అర్థం చేసుకుంటారని చెప్పలేమని ఆమె వ్యాఖ్యానించారు. తన వ్యక్తిత్వం గురించి చెబుతూ నమిత కీలక వ్యాఖ్యలు చేశారు. తన స్నేహితులు, ఆప్తులకు ఎవరైనా అన్యాయం చేసినా, వారిని కించపరిచినా తాను మౌనంగా ఉండలేనని స్పష్టం చేశారు.

4 / 5
తన కోసం మాత్రమే కాకుండా తనకు ఇష్టమైన వ్యక్తుల కోసం కూడా నిలబడతానని తెలిపారు. ఇతరుల అభిప్రాయాలకు భయపడి తన వైఖరిని మార్చుకోవడం తనకు ఇష్టం లేదనే విషయాన్ని ఆమె మాటలు తెలియజేశాయి. బిగ్ బాస్ షో తర్వాత సోషల్ మీడియాలో ఎదురైన విమర్శల గురించి కూడా నమిత తన అనుభవాలను పంచుకున్నారు. మొదట్లో తన సున్నితమైన మనస్తత్వాన్ని దృష్టిలో ఉంచుకుని, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే ప్రతికూల కామెంట్లను పట్టించుకోవద్దని, అవసరమైతే వాటిని బ్లాక్ చేయాలని తన భర్త సూచించినట్లు తెలిపారు.

5 / 5
అయితే తాను ఎలాంటి తప్పు చేయనప్పుడు ఇతరుల నుంచి దూషణలు ఎదుర్కోవడం ఎందుకనే ఆలోచన తనను బాధించిందని చెప్పారు. కొంతకాలం తర్వాత విమర్శలకు భయపడి వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తన అభిప్రాయాన్ని ఇతరులకు వివరించేందుకు ప్రయత్నించానని, కొందరు తన మాటలను అర్థం చేసుకున్నప్పటికీ మరికొందరు అర్థం చేసుకోలేకపోయారని తెలిపారు.సోషల్ మీడియాలో తనకు ఎదురైన కొన్ని కామెంట్లు హద్దులు దాటిపోయాయని నమిత ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లికి క్యాన్సర్ వచ్చి చనిపోవాలని, తన పెంపుడు జంతువులు, పిల్లలకు కూడా హాని జరగాలని కోరుకుంటూ కొందరు దారుణమైన వ్యాఖ్యలు చేసినట్లు వెల్లడించారు. ఇలాంటి మాటలు చదివినప్పుడు తట్టుకోలేక ఏడ్చేశానని ఆమె చెప్పుకొచ్చారు.

Loading...
Unable to load recommendations.
Follow Us