
మీర్నా మీనన్ ఫ్రీ లాన్స్ మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. 2016లో పట్టతారి అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాలోనే తన నటనా అందంతో మంచి మార్కులు కొట్టేసింది..

ఇక 2022లో క్రేజీ ఫెలో అనే సినిమా ద్వారా తెలుగు వెండితెరకు పరిచయం అయ్యింది. ఈ మూవీతో ఈ అమ్మడుకు అంతగా హైప్ రాలేదనే చెప్పాలి.

జైలర్ మూవీలో ఛాన్స్ కొట్టేసి ఈ సినిమాలో తలైవా కోడలిగా తన నటనతో అదరగొట్టింది. ఈ మూవీతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమాంతం పెరిగింది. తర్వాత అల్లరి నరేష్ ఉగ్రంసినిమాలో కూడా నటించి మెప్పించింది ఈ బ్యూటీ.

ఇవే కాకుండా నా సామీ రంగ వంటి పలు సినిమాల్లో ఈ అమ్మడు తన అందంతో అందరినీ కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో చాలా వరకు అవకాశాలు తగ్గాయి.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది. వరస ఫొటో షూట్స్‌తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా బ్లాక్ స్కట్ లో యూత్‌ను మాయ చేసింది ఈ ముద్దుగుమ్మ. బ్లాక్ స్కట్‌లో కొంటె చూపు చూస్తు, తన అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.