
ప్రస్తుతం తెలుగులో ది మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్టులో మీనాక్షి చౌదరి కూడా ఒకరు. ఇటీవల ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టుతున్నాయి.

2024లో మీనాక్షి నటించిన లక్కీ భాస్కర్ వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇక గతేడాది వెంకటేష్ తో కలిసి ఆమె నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్లు కూడా సాధించింది.

ఇక ఈ ఏడాది సంక్రాంతికి అనగనగా ఒక రాజు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకుందీ ముద్దుగుమ్మ. ఈ మూవీ కూడా రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించింది. ఆమె కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

స్తుతం అక్కినేని నాగార్జునతో కలిసి వృషకర్మ అనే హారర్ థ్రిల్లర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది మీనాక్షి. విరూపాక్షి సినిమాతో అందరి దృష్టి ఆకర్షించిన కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటోన్న మీనాక్షి తాజాగా నేపార్ వెకేషన్ కు వెళ్లింది. అక్కడి ప్రకృతి అందాలను మనసారా ఆశీర్వదించి. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమెనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.