Laya: ఆ స్టార్ హీరో సినిమా మిస్ చేసుకున్నా.. చిన్న రోల్ అనుకున్నా కానీ పెద్ద హిట్ అయ్యింది..

Updated on: Apr 25, 2026 | 1:23 PM

ప్రముఖ నటి లయ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, రీ-ఎంట్రీ అలాగే నటుడు జగపతిబాబు గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా, జగపతిబాబు ప్రస్తుత లుక్, తాను మిస్ చేసుకున్న అరవింద సమేత సినిమా పాత్ర,రీ-ఎంట్రీకి సంబంధించి తనకున్న అంచనాల గురించి ఆమె తెలిపారు.

1 / 5
ప్రముఖ నటి లయ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, రీ-ఎంట్రీ అలాగే నటుడు జగపతిబాబు గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా, జగపతిబాబు ప్రస్తుత లుక్, తాను మిస్ చేసుకున్న అరవింద సమేత సినిమా పాత్ర,రీ-ఎంట్రీకి సంబంధించి తనకున్న అంచనాల గురించి ఆమె వివరంగా మాట్లాడారు. జగపతిబాబు ప్రస్తుత "సాల్ట్ అండ్ పెప్పర్" లుక్ పై లయ తన ప్రశంసలు కురిపించారు."నాకు ఇప్పుడు లుక్కే నచ్చింది. నేను కూడా ఆయనతో చాలా చెప్పి ఇప్పుడు చాలా స్మార్ట్ గా ఉన్నారండి అని చెప్పాను నేను కూడా," అని లయ అన్నారు. ఈ లుక్ ఆయన వయసును కనిపించకుండా చేస్తుందని, ఇది చాలా స్మార్ట్ మూవ్ అని, ఆయనకు బాగా సూట్ అయిందని అభిప్రాయపడ్డారు.

2 / 5
ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్రంలో జగపతిబాబు భార్య పాత్రను లయ చేయాల్సిందిగా ఆహ్వానించబడ్డారు. అయితే, ఆ పాత్రను తాను చిన్నదిగా భావించి వదులుకున్నానని ఆమె వెల్లడించారు. "నేను ఫుల్ స్టోరీ కూడా వినలేదు. ప్లస్ ఏమనిపించిందంటే మరీ చిన్న రోల్ ఏమో అని అనిపించింది," అని లయ తెలిపారు. ఆ తర్వాత అది చాలా పవర్ ఫుల్ రోల్ అని తెలిసి పశ్చాత్తాపపడినట్లు ఆమె అన్నారు. 

3 / 5
"కొన్నిసార్లు తప్పు డెసిషన్స్ తీసుకుంటాం, అది నేను మిస్ చేసుకున్న వాటిల్లో ఒకటి," అని ఆమె పేర్కొన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు స్వయంవరం సినిమాకు రైటర్ కావడంతో, ఆయనే తనకు కబురు పంపించి ఉండవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. సినిమా రీ-ఎంట్రీ గురించి లయ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నా అని అన్నారు. మొదటిసారి సినిమా చేసినప్పుడు ఎటువంటి ఒత్తిడి ఉండదని, కానీ ఇప్పుడు "రీ-ఎంట్రీ అనేసరికి ఎక్స్పెక్టేషన్ ఆల్రెడీ ఆడియన్స్ కి ఉంటాయని అని ఆమె వివరించారు.

4 / 5
తన మొదటి రీ-ఎంట్రీ సినిమా పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండాలని ఆమె కోరుకున్నారు. "ఎందుకు ఈ క్యారెక్టర్ చేసింది లయా అని అనుకోకూడదు ఎవరు. ఈ క్యారెక్టర్ కోసం ఎందుకు చేసింది? ఇప్పటివరకు బానే ఉంది కదా హ్యాపీగా ఉంది కదా అమెరికాలో. ఎందుకు వచ్చింది వెనక్కి? ఇప్పుడు అని అనుకోకూడదు," అని లయ అన్నారు. తాను చేసే సినిమా గుర్తుండిపోవాలని, "ఓ కం బ్యాక్ అసలు ఎంత బాగుంది అని అనిపించాలి అని ఆమె స్పష్టం చేశారు లయ.

5 / 5
ఆడియన్స్ తన నుంచి ఏం ఆశిస్తున్నారో తనకు తెలియదని, అందుకే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భయంగా ఉందని లయ వివరించారు. చివరగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినీ ప్రయాణం గురించి ప్రస్తావిస్తూ, స్వయంవరం సినిమా డైలాగ్స్ అప్పుడే ఆయన మీద అంచనాలను పెంచాయని లయ గుర్తుచేసుకున్నారు. నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను వంటి చిత్రాలకు కూడా ఆయన డైలాగ్ రైటర్ గా పనిచేశారని, డైరెక్షన్ చేశాక ఆయన ఎవరికీ డైలాగ్స్ రాయలేదని, అది ఆయన విజయానికి నిదర్శనమని లయ పేర్కొన్నారు.

Follow Us