
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో ‘పుష్ప’ సినిమా ఎంతటి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకోవడమే కాకుండా, దేశవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2021లో విడుదలైన ‘పుష్ప: ది రైజ్’ కథ, కథనం, అల్లు అర్జున్ నటన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇలా అన్ని ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు దేశవ్యాప్తంగా సెన్సేషన్‌గా మారాయి. వాటిలో సమంత చేసిన ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా’ స్పెషల్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాటలో సమంత తన గ్లామర్, అదిరిపోయే డ్యాన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. చంద్రబోస్ అందించిన సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించగా, ఇంద్రావతి చౌహాన్ తన గొంతుతో పాటకు మరింత ప్రత్యేకత తీసుకొచ్చింది

విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ పాట దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకుంది. సమంత బోల్డ్ లుక్, హావభావాలు, డ్యాన్స్ మూమెంట్స్ ఇప్పటికీ అభిమానులకు గుర్తుండిపోయాయి. అయితే ఈ స్పెషల్ సాంగ్ కోసం చిత్రబృందం తొలుత సమంతను కాకుండా మరో హీరోయిన్ను సంప్రదించాలని భావించిందట. ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు.. కేతిక శర్మ. ఈ విషయాన్ని స్వయంగా ‘రాబిన్ హుడ్’ సినిమా నిర్మాత రవి వెల్లడించారు.

నితిన్ హీరోగా నటించిన ‘రాబిన్ హుడ్’ సినిమాలో కేతిక శర్మ కూడా స్పెషల్ సాంగ్‌లో సందడి చేసింది. గతంలో ఆ సినిమా ప్రమోషన్ల సమయంలో నిర్మాత రవి మాట్లాడుతూ.. ‘పుష్ప’ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం ముందుగా కేతిక శర్మ పేరును పరిశీలించినట్లు వెల్లడించారు. దీంతో ఇప్పుడు ఈ విషయం మరోసారి ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కేతిక శర్మకు ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా’ పాట చేసే అవకాశం వచ్చి ఉంటే ఆమె కెరీర్‌కు మరింత పెద్ద గుర్తింపు వచ్చేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

సమంత స్థానంలో కేతిక శర్మ కనిపించి ఉంటే ఆ పాట ఎలా ఉండేదో అంటూ చర్చించుకుంటున్నారు. ఏదేమైనా సమంత చేసిన ఈ స్పెషల్ సాంగ్ మాత్రం ‘పుష్ప’ సినిమాలోనే కాదు, భారతీయ సినిమా పాటల్లోనూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇక కేతిక వరుసగా సినిమాలు చ్చేస్తున్నప్పటికీ సరైన హిట్ అందుకోలేకపోతుంది. ఆ మధ్య సింగిల్ అనే సినిమాతో హిట్ అందుకున్నా ఆతర్వాత పెద్దగా ఆఫర్స్ అందుకోలేకపోతుంది ఈ ముద్దుగుమ్మ.