
కళ్యాణి ప్రియదర్శన్.. ఈ ముద్దుగుమ్మ అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమా నిరాశపరిచింది కానీ.. కళ్యాణి తన నటనతో, అందంతో ఆకట్టుకుంది. ఈ అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి.

హలో సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమాతో ఆకట్టుకుంది. చిత్రలహరి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత శర్వానంద్ తో రణరంగం అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది.

ప్రస్తుతం ఈ చిన్నది మలయాళంలో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. తెలుగులో మంచి అవకాశం వస్తే చేయడానికి రెడీగా ఉంది. తెలుగులో కళ్యాణి సినిమా చేసి దాదాపు 6 ఏళ్లు అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో 8 ఏళ్లుగా యాక్టివ్ గా ఉంది కళ్యాణి ప్రియదర్శన్.

ఇదిలా ఉంటే కళ్యాణి ప్రియదర్శన్, హీరో మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ తో ప్రేమలో ఉంది అంటూ వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఇద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. దాంతో ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకుంటారని వార్తలు పుట్టుకొచ్చాయి.

ఈ క్రమంలోనే కళ్యాణి తల్లి లిజి లక్ష్మి సోషల్ మీడియాలో పూజ చేస్తున్న ఫోటోలను పంచుకున్నారు. ఈ ఫోటోలకు నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేశారు. కాగా ఓ నెటిజన్ కల్యాణి - ప్రణవ్ పెళ్లి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అని కామెంట్ చేశాడు. దానికి ఆమె రిప్లే ఇస్తూ అవన్నీ అబద్ధపు వార్తలు అని తేల్చి చెప్పారు.