రెండు సార్లు ఆ హీరోతో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్నా.. అసలు విషయం చెప్పిన ఇంద్రజ

Updated on: May 12, 2026 | 4:16 PM

తెలుగు చిత్రసీమలో అందాల తార ఇంద్రజ తన కెరీర్ ప్రయాణంలో మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి పనిచేసే అవకాశం రెండుసార్లు తృటిలో చేజార్చుకున్న తీరును ఇటీవల జరిగిన ఒక ఓ ఇంటర్వ్యూలో తెలిపారు . తన సినీ ప్రస్థానంలో చిరంజీవితో ఒక పాటలోనైనా డాన్స్ చేయాలనే తన బలమైన కోరిక ఇప్పటికీ తీరలేదని ఆమె అన్నారు.

1 / 5
తెలుగు చిత్రసీమలో అందాల తార ఇంద్రజ తన కెరీర్ ప్రయాణంలో మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి పనిచేసే అవకాశం రెండుసార్లు తృటిలో చేజార్చుకున్న తీరును ఇటీవల జరిగిన ఒక ఓ ఇంటర్వ్యూలో తెలిపారు . తన సినీ ప్రస్థానంలో చిరంజీవితో ఒక పాటలోనైనా డాన్స్ చేయాలనే తన బలమైన కోరిక ఇప్పటికీ తీరలేదని ఆమె అన్నారు. ఇంద్రజ మాట్లాడుతూ..

2 / 5
చిరంజీవితో వచ్చిన మొదటి అవకాశం ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన అల్లుడ మజాకా చిత్రంలో సిస్టర్ క్యారెక్టర్. చిరంజీవితో స్క్రీన్‌పై కలిసి డాన్స్ చేయాలనే తన ఆశయానికి సిస్టర్ పాత్ర అడ్డుపడుతుందని భావించి, ఆ పాత్రను సున్నితంగా తిరస్కరించారట. ఆతర్వాత, ఆ పాత్రను నటి ఊహ పోషించారు. ఒకవేళ సిస్టర్ గా నటిస్తే చిరంజీవితో రొమాంటిక్ లేదా డాన్స్ పార్ట్‌నర్‌గా నటించే అవకాశాలను దూరం చేస్తుందని ఆమె భావించారట.

3 / 5
రెండో అవకాశం ఎడిటర్ మోహన్ నిర్మించిన హిట్లర్ చిత్రంలో వచ్చింది. ఈ చిత్రంలో నటుడు రాజేంద్ర ప్రసాద్ పక్కన ఒక ముఖ్యమైన పాత్రలో నటించాల్సింది. అయితే, అప్పట్లో ఆమె తమిళంలో రాంకీతో కలిసి తడయం చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారట. విజయశాంతి స్వంత నిర్మాణ సంస్థలో రూపొందిన ఆ చిత్రం కారణంగా, హిట్లర్ సినిమాలో అవకాశం కూడా ఆమె చేతి నుంచి జారిపోయిందని తెలిపారు ఇంద్రజ.

4 / 5
చిరంజీవితో ఒక సినిమా అయినా చేయాలనే ఆశ ఇంకా సజీవంగా ఉందని, దురాశ కాదని, కేవలం ఒక డాన్స్ పాటలో అయినా ఆయనతో కలిసి నటించాలనే కోరిక ఉందని ఆమె స్పష్టం చేశారు. చిరంజీవిని "డాన్స్ అంటే చిరు గారు" అని ఆమె అన్నారు. చిరంజీవి నుంచి తాను నేర్చుకున్న అతి ముఖ్యమైన విషయం ఆయన మాట్లాడే విధానం అని ఇంద్రజ అన్నారు. అందరితో ఎలా మర్యాదగా మాట్లాడాలి, కోపం ఉన్నప్పటికీ మాటల్లో ఎప్పుడూ సంయమనం కోల్పోకుండా ఎలా ఉండాలి అనే విషయాలను చిరంజీవి నుంచి గమనించి, నేర్చుకున్నానని తెలిపారు.

5 / 5
ఇలా రెండు సార్లు చిరంజీవితో నటించే ఛాన్స్ మిస్ అయ్యాను అని తెలిపారు ఇంద్రజ. ప్రస్తుతం ఇంద్రజ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన ఇంద్రజ ఇప్పుడు సహాయక పాత్రలు, అమ్మ , వదిన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోలకు జడ్జ్ గానూ వ్యవహరిస్తున్నారు ఇంద్రజ.

Follow Us