
మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ హీరోగా నటించిన బ్యాచిలర్ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది దివ్యభారతి. ఫస్ట్ మూవీతోనే రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది. అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది.

దీంతో ఈ అమ్మడుకు ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. 1992 జనవరి 28న జన్మించిన దివ్యభారతి.. గ్రాడ్యూయేషన్ అనంతరం నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీతోనే యువతలో ఎక్కడలేని క్రేజ్ సంపాదించుకుంది. బ్యాచిలర్ సినిమా తర్వాత ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వచ్చాయి.

మధిల్ మెల్ కాదల్, కింగ్ స్టన్, ఆసై, మహారాజా వంటి చిత్రాలతో మరోసారి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం తెలుగులో సుడిగాలి సుధీర్ సరసన G.O.A.T – Greatest Of All Time అనే సినిమాలో నటిస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్ ఆకట్టుకున్నాయి.

తెలుగులో దివ్యభారతికి ఇదే ఫస్ట్ మూవీ. కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రాబోతుంది. అలాగే ఈ చిత్రం తర్వాత తెలుగులో ఈ బ్యూటీకి మరిన్ని ఆఫర్స్ రావడం ఖాయంగా తెలుస్తోంది.

ఇక రీసెంట్ గా జీవి ప్రకాష్ తో కలిసి దివ్యభారతి నటిస్తున్న కింగ్ స్టన్ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దివ్యభారతి తాజాగా కొన్ని ఫోటోలను వదిలింది. ఈ ఫొటోల్లో తన అందాలతో మరోసారి కవ్వించింది ఈ చిన్నది.