
బోట్ రాకర్జ్ 113 (boAt Rockerz 113): ఇది జస్ట్ రూ.599 వస్తుంది. కేవలం రూ.1000లోపు అత్యంత తక్కువ బడ్జెట్‌లో లభించే ఏకైక నెక్‌బ్యాండ్ ఇదే కావచ్చు. ఇందులో 10mm డైనమిక్ డ్రైవర్లు ఉంటాయి. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. దాదాపు 40 గంటల పాటు వస్తుంది. అలాగే ఇందులో బ్లూటూత్ 5.3, కాల్స్ కోసం ENx టెక్నాలజీ, డ్యూయల్ పెయిరింగ్ సపోర్ట్ కూడా ఉంది. గేమింగ్ కోసం ప్రత్యేకంగా ఇందులో 60ms బీస్ట్ మోడ్ , IPX5 వాటర్ రెసిస్టెన్స్, ASAP ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారు.

నాయిస్ ఎయిర్‌వేవ్ (Noise Airwave): ఈ సేల్‌లో తక్కవ బడ్జెట్‌తో మంచి ఫీచర్లతో వచ్చే బెస్ట్ నెక్ బ్యాండ్ ఏదైనా ఉందంటే అది నాయిస్ ఎయిర్‌వేవ్ అనే చెప్పాలి. జస్ట్ రూ. 999 వచ్చే ఈ నెక్ బ్యాండ్ 10mm డ్రైవర్ తో వస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఈజీగా 50 గంటల వరకు వాడొచ్చు. అంతేకాదు ఇందులో బ్లూటూత్ 5.3 సపోర్ట్, స్పష్టమైన కాల్స్ కోసం నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ కూడా ఇచ్చారు. అలాగే 3 EQ మోడ్స్, గేమింగ్ కోసం 50ms లో-లేటెన్సీ మోడ్స్ కూడా ఇందులో ఉన్నాయి. రూ.999లో ఇన్ని ఫీచర్స్ ఇచ్చే బెస్ట్ నెక్ బ్యాండ్ అంటే ఇదే అని చెప్పాలి.

రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ 5: ఇది మీకు గ్రేట్ ఇండియన్ సేల్స్‌లో రూ.1,782లో లభిస్తోంది.ఇందులో 13.6mm డైనమిక్ డ్రైవర్లు, 50dB హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే వితౌట్ ఏఎన్‌సీతో దీన్ని 38 గంటల పాటు వాడొచ్చు. దీంతో ఉన్న స్పెషల్ ఫీచర్ ఏంటంటే.. 360-డిగ్రీ స్పేషియల్ ఆడియోతో వస్తుంది, బ్లూటూత్ 5.4, డ్యూయల్-డివైస్ కనెక్టివిటీ, IP55 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. అంతేకాదు ఇది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి జస్ట్ 10 నిమిషాల సరిపోతుంది.

వన్‌ప్లస్ బుల్లెట్స్ వైర్‌లెస్ Z3 (OnePlus Bullets Wireless Z3): ఇది మీకు రూ.1,599కే లభిస్తోంది. ఇది మీకు 12.4mm డైనమిక్ డ్రైవర్లు, 3D స్పేషియల్ ఆడియో సపోర్ట్‌తో వస్తోంది. ఇది కూడా ఒక్కసారి ఛార్జ్ చేస్తే 36 గంటల ప్లేబ్యాక్ లభిస్తుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో ఏకంగా 27 గంటల పాటు పని చేయడం దీని ప్రత్యేకత. ఇది బ్లూటూత్ 5.4, IP55 రేటింగ్‌తో వస్తుంది.

వన్‌ప్లస్ బుల్లెట్స్ వైర్‌లెస్ Z2 (OnePlus Bullets Wireless Z2 ANC): ఇది మీకు రూ. 2,049 దగ్గర లభిస్తోంది. ఇందులో 45dB హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, 12.4mm డైనమిక్ డ్రైవర్లు ఉంటాయి. ఈ బ్యాండ్స్‌ను ANC లేకుండా వాడితే సుమారు 28 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. అలాగే ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సఫోర్ట్‌తో పాటు, బ్లూటూత్ 5.2, IP55 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ కూడా ఉన్నాయి.