Kitchen Hacks: టమోటాలు త్వరగా పాడవుతున్నాయా?.. ఇలా స్టోర్‌ చేస్తే వారమైన చెక్కుచెదరవంతే

Updated on: Mar 26, 2026 | 4:28 PM

ఎండాకాలం వచ్చిందంటే చాలా జనాలు అనే సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా మార్కెట్‌ నుంచి తెచ్చుకున్న కూరగాయలు వేడి కారణంగా త్వరగా కుళ్లిపోతూ ఉంటాయి. వాటిలో సున్నితంగా ఉండే టామోటాలు అయితే తెచ్చిన రెండ్రోజులకే మెత్తపడిపోతాయి. ఇది ప్రతి ఇంట్లో ఎదుర్కొనే పెద్ద సమస్య. కాబట్టి మేం చెప్పబోయే ఈ టిప్స్ పాటిస్తే మీరు వారం రోజులైనా టమోటాలను ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు. అదెలానో తెలుసుకుందాం పదండి.

1 / 5
భారతీయ వంటకాల్లో టమోటా లేని వంటను ఊహించుకోవడం కష్టం. కూరల్లో రుచికోసమే కాకుండా, సలాడ్లలో కూడా దీనిని ఎక్కువగా వాడుతుంటారు. అయితే కిలోల కొద్దీ తెచ్చుకున్న ఈ టమోటాలు రెండు మూడు రోజుల్లోనే మెత్తబడి పాడైపోతాయి. ముఖ్యంగా వేసవిలో ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. మీ టమోటాలు వారం రోజుల పాటు తాజాగా ఉండాలంటే ఈ క్రింది స్మార్ట్ కిచెన్ హ్యాక్స్ పాటించండి

2 / 5
తేమకు దూరంగా ఉంచండి: చాలామంది టమోటాలు మార్కెట్ నుండి తెచ్చిన వెంటనే కడిగి స్టోర్ చేస్తారు. ఇలా చేయడం వల్ల వాటిలో తేమ పెరిగి త్వరగా కుళ్ళిపోతాయి. కాబట్టి టమోటాలను పొడిగా ఉంచడం ముఖ్యం. వాటిని పేపర్ బ్యాగ్‌లో లేదా గాలి ఆడే బుట్టలో ఉంచడం మంది. ఒక వేళ మీరు వంటకు వాడుకోవాలి అనుకుంటే అప్పుడే కడిగి కట్‌చేసుకోండి.

3 / 5
తొడిమె భాగం కిందకు ఉండేలా: చాలా మంది ఇంట్లో టమోటాలను ఎలా పడితే అలా బుట్టలో పడేస్తారు. కానీ టమోటాలను స్టోర్ చేసేటప్పుడు వాటి తొడిమె ఉన్న వైపు కిందకు ఉండేలా పెట్టాలి. ఇలా చేయడం వల్ల టమోటా లోపలికి గాలి తక్కువగా వెళ్తుంది, దీనివల్ల అవి త్వరగా పాడవవు. టమోటాలోని తేమ, ఆకృతి ఎక్కువ కాలం దెబ్బతినకుండా ఉండటానికి ఇది ఒక గొప్ప ట్రిక్

4 / 5
ఎప్పుడూ ఫ్రిజ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు: చాలా మంది టమోటాలను తరచుగా ఫ్రిజ్‌లో పెడుతూ ఉంటారు. కానీ టమోటాలు గది ఉష్ణోగ్రత వద్ద కూడా తాజాగా ఉంటాయి. మరీ ఎక్కువగా పండిపోయిన టమోటాలు అయితేనే ఫ్రిజ్‌లో పెట్టాలి, అప్పుడు వాటి లైఫ్ కొంచెం పెరుగుతుంది. లేదంటే బయట ఉంచడమే మంచిది.

5 / 5
పండిన టమోటాల కోసం స్మార్ట్ ఐడియా: ఒకవేళ టమోటాలు బాగా పండిపోయి, మీరు వెంటనే వాడలేకపోతుంటే.. వాటిని మొత్తగా గ్రౌండ్‌ చేసి ఆ పేస్ట్‌ను గాలి చొరబడని డబ్బాలో పోసి ఫ్రీజర్‌లో పెట్టండి. ఆ తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరల్లో గ్రేవీ కోసం లేదా సూప్ కోసం ఈ ప్యూరీని వాడుకోవచ్చు.

Follow Us