
ముందుగా ఒక అల్యూమినియం ఫాయిల్‌ను తీసుకుని, దానిని అర్ధచంద్రాకారం షేప్‌లో వంచండి.. తర్వాత దాన్ని మీ రూటర్ యాంటెన్నా వెనుక భాగంలో ఉంచండి. ఇది రూట్‌కు డిష్ యాంటెన్నాలా పనిచేస్తుంది.ఇలా చేయడం ద్వారా వై-ఫై సిగ్నల్స్ అన్ని వైపులా వెళ్లకుండా.. కేవలం మీకు కావలసిన గది వైపునకు బౌన్స్ అవుతాయి. ఇలా చేయడం వల్ల వైపై నెట్‌వర్క్ స్పీడ్ దాదాపు 55శాతం పెరిగినట్టు ఓ పరిశోదనలో తేలింది.

వైపై స్పీడ్‌ను పెంచే మరో చిట్కా ఏమిటంటే.. కార్డు బోర్డ్ రోల్.. ఇందుకోసం మీరు ఇంట్లో ఖాళీగా ఉన్న ఒక కార్డ్‌బోర్డ్ రోల్ తీసుకుని, దానికి అల్యూమినియం ఫాయిల్‌ను చుట్టండి. తర్వాత దానిని రూటర్ యాంటెన్నాపై స్లైడ్ చేస్తూ అమర్చండి. ఈ ఫాయిల్ రేడియో తరంగాలను రిప్లెక్ట్ చేస్తూ.. ఒకే దిశలో కేంద్రీకరిస్తుంది. దీని వల్ల సిగ్నల్స్ పెరిగి మీ ఇంట్లో వైపై స్పీడ్ పెరుగుతుంది. తక్కువ ఖర్చుతో కూడిన ఇలాంటి రిఫ్లెక్టర్లు కూడా ఇంట్లో వై-ఫై కవరేజ్ పరిధిని పెంచుతాయని పరిశోధనల్లో తేలింది.

అయితే మీ సిగ్నల్ బయటకి పోకుండా మీరే వాడుకోవాలి అనుకంటే.. మీరు మీ ఇంటికి కిటికీ వైపు అల్యూమినియం ఫాయిల్‌ను ఉంచండి. ఇది మీ వై-ఫై సిగ్నల్స్ బయటకు లీక్ అవ్వకుండా నిరోధించి, సిగ్నల్స్ మీ ఇంట్లోనే ఉండేలా చేస్తాయి. దీనివల్ల మీ సిగ్నల్ బలం పెరగడమే కాకుండా, బయటి వ్యక్తులు లేదా హాకర్లు మీ నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయకుండా కాపాడుతుంది.

కొన్ని సార్లు మనం రూమ్‌లో ఒక ప్లేస్‌లో కూర్చున్నప్పుడు అక్క వైఫై ఉన్నప్పటికీ సిగ్నల్ రాదు.. అలాంటప్పుడు మీరు ఒక అల్యూమినియం ఫాయిల్ తీసుకొని.. డెడ్ జోన్ వైపు చూస్తున్న రూటర్ వైపు వంగిన ఫాయిల్ రిఫ్లెక్టర్‌ను ఉంచండి. ఇలా పెట్టడం ద్వారా ఎక్కడైనా సిగ్నల్ వీక్‌గా ఉంటుదో అక్కడికి ఈ రిఫ్లెక్టర్ సిగ్నల్స్‌ను పంపుతుంది. ఇది కూడా కచ్చితంగా పరిశోదనలో రుజువైంది.

అయితే చాలా మంది వైఫై రూటర్‌ను ఇంట్లో టీవీ పక్కనో లేదా సెల్ఫ్‌లోనే ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా సిగ్నల్ సరిగ్గా రాదు. కాబట్టి ఎప్పుడూ వైఫై రూటర్‌ను ఎత్తైన ప్రదేశాల్లో ఉంచడం మంచిది. అప్పుడు మాత్రమే మీకు ఈ ఫాయిల్ ట్రిక్ సరిగ్గా పనిచేస్తుంది. ఫస్ట్ మీరు రూటర్‌ను కరెక్ట్ ప్లేస్‌లో అమర్చిన తర్వాత ఆపై మీరు ఎక్కువగా ఉండే ప్రాంతం వైపు ఫాయిల్ రిఫ్లెక్టర్‌ను అమర్చండి. వై-ఫై సిగ్నల్స్ కూడా కాంతి లాగే లోహాల ద్వారా ప్రతిబింబిస్తాయి కాబట్టి, రూటర్ ప్లేస్‌మెంట్ ఎంత బాగుంటే, ఫాయిల్ అంత బాగా పనిచేస్తుంది. నెట్‌వర్క్ స్పీడ్ కూడా అలానే పెరగుఉతుంది.