
చాణక్య నీతి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో ముఖ్య విషయాల గురించి తెలిపాడు. యువత నుంచి పెద్ద వాళ్ళ వరకు నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

జీవితంలోకి ఎంతో మంది వస్తూ పోతూ ఉంటారు. అయితే, ఎవరు ఎంత కాలం కలిసి ఉంటారో ఎవరికీ తెలీదు. కొందరు తెలియకుండానే క్లోజ్ అవుతారు. అలాంటి వాళ్ళు చెడు చేస్తున్నా అసలు గుర్తించము. వారిని అలాగే వదిలేస్తే మీ పరువు కూడా ఏదొక రోజు తీస్తారు. అలాంటి వారిని అస్సలు క్షమించకండి.!

చాణక్య నీతి: పదే పదే మిమ్మల్ని తప్పు పట్టే వాళ్లకి కొంచం దూరంగా ఉండాలి ఇంకా మీకు ఒకటి చెప్పి ఇంకోటి చెప్పి మోసం చేసే వాళ్ళని కూడా అసలు క్షమించకండి ఇంకా హింసించేవారు అలాగే మీ దగ్గర నమ్మకం పోగొట్టుకున్న వాళ్ళని అసలు క్షమించకూడదు. ఇలాంటి వాళ్ళు పాము కంటే డేంజర్ కాబట్టి మీరే వాళ్ళకి దూరమవ్వండి

చాణక్య నీతి: ఎన్ని సార్లు తప్పు చేసినా అసలు పశ్చాత్తాపం లేనివారిని దూరం పెట్టాలి కొంచం కూడా పశ్చాత్తాపపడకుండా నటించే వారిని కూడా మీ జీవితంలో నుంచి తొలగించండి ఇంకా బాధ్యతను తెలుసుకోని వారిని కూడా క్షమించడం హానికరం కాబట్టి ఇలాంటి వాళ్ళకి మీరు ఎంత దూరంగా ఉంటె మీ జీవితం అంత మంచిగా ఉంటుంది.

మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసేవారిని కూడా అసలు క్షమించకండి. ఇంకా ఇలాంటి వారికీ కూడా దూరంగా ఉండటం మంచిది. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)