
ఆచార్య చాణుక్యుడు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలిపాడు. నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. జీవితంలో కొన్ని విషయాల దగ్గర అస్సలు సిగ్గు పడకండి.. చాణుక్యుడు చెప్పిన వివరాల పై ఓ లుక్కేయండి

సమాజంలో అందరు మనకి నచ్చినట్టే మాట్లాడరు ఎవరో ఎదో అనుకుంటారని అసలు భయపడకూడదు. చాలా మంది ఏమనుకుంటారో ఆందోళన, సిగ్గుతో ఆగిపోతారు అలాంటి వారు పనులను కూడా చేయలేరు జీవితంలో గెలవాలి అంటే ఇలాంటి వాటిని లెక్క చెయ్యకూడదని చాణక్యుడు హెచ్చరించారు. కాబట్టి ఇలా వాటి అస్సలు సిగ్గుపడకండి.

కొంతమంది అభిప్రాయాలను బయటకి చెప్పడానికి చాలా ఆలోచిస్తారు. చాణక్యుడి నీతి ప్రకారం, మీరు అనుకున్నది ధైర్యంగా చెప్పాలి. అలాగే ఎవరైనా తప్పు చేస్తే అది తప్పు అని చెప్పాలి అస్సలు సంకోచించకూడదు. మీరు ఏది ధైర్యంగా చెప్పలేకపోతే విజయం సాధించలేరు. మీ కోసం మాట్లాడలేని మీరు ఇతరుల కోసం కూడా ఏం చేయలేరు

ఆకలి వేస్తే అడిగి మరి తినాలి కొందరు ఇతరుల దగ్గర తినడానికి సిగ్గుపడతారు. అలాగే, ఆహారం తినే దగ్గర కూడా అస్సలు సిగ్గుపడకూడదని చాణక్యుడు చెప్పారు. ఇలా కడుపు మాడ్చుకుంటే మీకు మీరే కష్టాన్ని కొని తెచ్చుకుంటారు. డబ్బు అప్పుగా తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అడగడంలో తప్పు అస్సలు సిగ్గుపడకూడదు.

చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం కొత్త విషయాలు నేర్చుకోవడానికి అస్సలు సిగ్గుపడకూడదని చెబుతున్నారు ఎలాంటి సందేహాలను అయినా తెలుసుకోవాలి లేదంటే ముందుకు వెళ్ళలేరు. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)