ముందుగా, ఒక కప్పు నల్ల శనగలను రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం, నానబెట్టిన శనగలను శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి. ఇంకా దీనిలో తగినన్ని నీళ్లు పోయాలి. ఒక టేబుల్‌స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. మూత పెట్టి రెండు నుండి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

ఎక్కువ విజిల్స్ వస్తే శనగలు మరీ మెత్తగా అయిపోయి తాలింపుకు అంతగా రుచిగా ఉండవు. కుక్కర్ ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత, శనగలను వడకట్టి, నీటిని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి, ఒక టేబుల్‌స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి.

పోపు దినుసులు వేగిన తర్వాత, మూడు పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయను స్లైస్‌లుగా కట్ చేసి వేయాలి. గుగ్గిళ్ళలో ఎండు కారం పొడి వాడరు కాబట్టి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి నుంచి కారం రుచి వస్తుంది అందువల్ల కారం ఎక్కువ తినేవారు మరిన్ని పచ్చిమిర్చి వేసుకోవచ్చు. వీటితో పాటు, ఐదు-ఆరు వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి, ఐదు-ఆరు ఎండుమిర్చిని తుంచి వేసి బాగా వేయించాలి.

ఒకటి-రెండు నిమిషాలు వేపుకున్న తర్వాత, పావు టీస్పూన్ పసుపు, ఒక టీస్పూన్ చాట్ మసాలా పౌడర్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న శనగలను వేసి, తడి లేకుండా చూసుకోవాలి. బాగా కలిపిన తర్వాత, ఒక రెమ్మ కరివేపాకును చేర్చాలి. కరివేపాకును తాలింపులో ముందుగా వేయడం కంటే, ఇలా చివర్లో గుగ్గిళ్ళతో పాటు వేస్తే తినేటప్పుడు రుచిగా ఉంటుంది. ఉప్పు సరిపోయిందో లేదో చూసి, అవసరమైతే మరికొద్దిగా వేసుకోవాలి.